Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 10 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - १०


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹
१० श्लोकः
सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे
तेनास्य श्रवणात् तदर्थमननाद्ध्यानाच्चसङ्कीर्तनात्
सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः
सिद्ध्येत् तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् ॥

🌹पदविभागः-
सर्व-आत्मत्वम् इति स्फुटीकृतम् इदं यस्माद् अमुष्मिन् स्तवे तेन अस्य श्रवणात् तद्-अर्थ-मननाद् ध्यानात् च सङ्कीर्तनात् सर्व-आत्मत्व-महा-विभूति-सहितं स्याद् ईश्वरत्वं स्वतः सिद्ध्येत् तत् पुनः अष्टधा परिणतं च ऐश्वर्यम् अव्याहतम् ॥

🌹अन्वयः-
यस्माद् अमुष्मिन् स्तवे इति इदम् सर्वात्मत्वम् स्फुटीकृतम् अस्य श्रवणात् तदर्थमननात् ध्यानात् सङ्कीर्तनात् सर्वात्मत्व-महाविभूतिसहितं ईश्वरत्वम् पुनः अष्टधा परिणतम् तद् अव्याहतम् ऐश्वर्यं च स्वतः सिध्येत् ॥

🌹प्रतिपदार्थः-
यस्मात् = जिससे
अमुष्मिन् = इसमें
स्तवे = स्तोत्र में
इति = ऐसा
इदम् = यह
सर्वात्मत्वम् = सर्वात्मभाव
स्फुटीकृतम् = स्पष्ट किया हुआ
अस्य = इसका
श्रवणात् = सुनने से
तदर्थमननात् = उसका अर्थ मनन करने से
ध्यानात् = ध्यान करने से
सङ्कीर्तनात् = कहने से
सर्वात्मत्वमहाविभूतिसहितं >
            सर्वात्मत्व- = -सर्वात्मकता
            महाविभूति- = -महाविभूति
            सहितम् = सहित
ईश्वरत्वम् = स्वतंत्रता
पुनः = और
अष्टधा = आठरूप से
परिणतम् = परिवर्तित हुआ
तत् = वह
अव्याहतम् = निराघात
ऐश्वर्यं च = ईश्वरभाव
स्वतः = स्वयं ही
सिध्येत् = सिद्ध होगा 

🌹तात्पर्यम्-
            साधक सही गुरु के पास इस स्तोत्र का पाठ करे। उसके बाद अर्थ का ध्यान करे। उपनिषत्साररूप अद्वैत पर श्रद्धा, अचंचल विश्वास जगाने के लिए इस स्तोत्र का कीर्तन करना चाहिए। ऐसा करने पर साधक को ज्ञान मिलता है। ज्ञानाग्नि के द्वारा उसकी दुष्कृतियाँ नष्ट होंगे, व भेदभाव के मिटने पर वह स्वयं ही ईश्वरत्व को प्राप्त होता है। ऐसे साधक को अष्टसिद्धियों की प्राप्ति होती है
-----------------------------------------
🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం🌹

౧౦వశ్లోకము
🌹తత్త్వప్రకాశికా టీకా
మూలం-
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే
తేనాస్య శ్రవణాత్ తదర్థమననాద్ధ్యానాచ్చసఙ్కీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్ తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం ॥

పదవిభాగః-
సర్వ-ఆత్మత్వమ్ ఇతి స్ఫుటీకృతమ్ ఇదం యస్మాద్ అముష్మిన్ స్తవే తేన అస్య శ్రవణాత్ తద్-అర్థ-మననాద్ ధ్యానాత్ చ సఙ్కీర్తనాత్ సర్వ-ఆత్మత్వ-మహా-విభూతి-సహితం స్యాద్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునః అష్టధా పరిణతం చ ఐశ్వర్యమ్ అవ్యాహతం ॥

అన్వయః-
యస్మాద్ అముష్మిన్ స్తవే ఇతి ఇదమ్ సర్వాత్మత్వమ్ స్ఫుటీకృతమ్ అస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాత్ సఙ్కీర్తనాత్ సర్వాత్మత్వ-మహావిభూతిసహితం ఈశ్వరత్వమ్ పునః అష్టధా పరిణతమ్ తద్ అవ్యాహతమ్ ఐశ్వర్యం చ స్వతః సిధ్యేత్ ॥

ప్రతిపదార్థః-
యస్మాత్ = ఎందువల్లనైతే
అముష్మిన్ = ఈ
స్తవే = స్తోత్రమునందు
ఇతి = ఈవిధముగా
ఇదమ్ = ఈ
సర్వాత్మత్వమ్ = సర్వాత్మభావము
స్ఫుటీకృతమ్ = స్పష్టము చేయబడినదో అందువలన
అస్య = ఈ స్తోత్రము యొక్క
శ్రవణాత్ = వినుటవలన
తదర్థమననాత్ = దాని అర్థము మననము చేయుటవల్ల
ధ్యానాత్ = ధ్యానించుట వల్ల
సఙ్కీర్తనాత్ = చక్కగా కీర్తనము చేయుటవలన
సర్వాత్మత్వమహావిభూతిసహితం >
    సర్వాత్మత్వ- = సర్వాత్మత్వము అను-
    మహావిభూతి- = గొప్పమహిమతో-
    సహితమ్ = కూడియున్న
ఈశ్వరత్వమ్ = స్వాతంత్ర్యము
పునః = మరియు
అష్టధా = ఎనిమిది విధములుగా
పరిణతమ్ = పరిణామమును చెందిన
తత్ = అట్టి
అవ్యాహతమ్ = నిరాఘాటమైన
ఐశ్వర్యం చ = ఈశ్వర భావము కూడ
స్వతః = స్వయముగా
సిధ్యేత్ = సిద్ధించును

🌹తాత్పర్యమ్
    సాధకుడు సరియైన గురువు వద్ద ఈ స్తోత్రమును పఠించవలెను. తరువాత అర్థమును ధ్యానము చేయవలెను. ఉపనిషత్సారమగు అద్వైతముపై శ్రద్ధ అచంచల విశ్వాసము కలుగుట కొరకై ఈ స్తోత్రమును కీర్తన చేయవలెను. ఇట్లు చేసిన సాధకునకు జ్ఞానము కలుగును. జ్ఞానాగ్నిచే అతని దుష్కృతములన్నియు నశించి భేద భావము తొలగుటచే అతడు స్వయముగా ఈశ్వరత్వము పొందును. అట్టి సాధకునకు అష్ట సిద్ధులు లభించును.

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 9 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - ९


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹
९श्लोकः

🌹मूलम्-
भूरम्भांस्यनलोनिलोम्बरमहर्नाथो हिमांशुः पुमान्
इत्याभ्याति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् ।
नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभोः
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
भूः अम्भांसि अनलो अनिलो अम्बरम् अहः-नाथः हिमांशुः पुमान् इति आभ्याति चर-अचर-आत्मकम् इदं यस्य एव मूर्ति-अष्टकम् । न अन्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभोः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
भूः अम्भांसि अनलः अनिलः अम्बरम् अहर्नाथः हिमांशुः पुमान् इति यस्य मूर्त्यष्टकम् चराचरात्मकम् इदम् आभाति विमृशताम् यस्मात् विभोः परस्माद् अन्यत् किञ्चन न विद्यते तस्मै श्रीगुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदं नमः ॥

🌹प्रतिपदार्थः-
भूः = धरा
अम्भांसि = जल
अनलः = आग
अनिलः = वायु
अम्बरम् = आकाश
अहर्नाथः = सूरज
हिमांशुः = चाँद
पुमान् = जीव
इति = ऐसा
यस्य = जिसका
मूर्ति-अष्टकम् = आठमूर्ति रूप
चराचरात्मकम् = स्थावर जंगम
इदम् = यह
आभाति = प्रकाशित होता है
विमृशताम् = आत्मज्ञानियों को
यस्मात् = जिससे
विभोः = सर्वव्यापी से
परस्मात् = परब्रह्म से
अन्यत् = अन्य कुछ
किञ्चन = कुछ भी
न विद्यते = नहीं है
तस्मै = उस
श्रीगुरुमूर्तये = श्रीगुरुमूर्ति के लिए
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार है

🌹तात्पर्यम्-
            निर्गुणोपासन उत्तमाधिकारी ज्ञानियों के लिए साध्य है। मंदाधिकारियों के लिए सगुणोपासन क्रममुक्ति का प्रथम सोपान है। पर श्रीशंकर भगवत्पाद मंदाधिकारियों को उद्देशित कर, अष्टमूर्ति उपासना का विधान कर रहे हैं। शिव हमसे दूर, अदृश्य कहीं और है, ऐसा सोचना भ्रांति है।
            शिव अष्टमूर्ति है। भूमि, पानी, हवा, आग, आकाश, यह पंचभूत, सूर्य चंद्र व जीव यह शिव के आठ रूप हैं। स्थावर जंगमात्मक यह जगत् सारा आठ मूर्तियों से भरा हुआ है। उस परमशिव से भिन्न कुछ भी नहीं है। भौतिक प्रपंच, अनेक प्रकार के प्राणिवर्ग, पहले का जन्मा, अब जन्म ले रहे यह सब जो भी है, सब यह रुद्र ही है, ऐसे रुद्र को नमस्कार है
-----------------------------------------
 

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్🌹
౯వశ్లోకము
🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
భూరమ్భాంస్యనలోనిలోమ్బరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభ్యాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్ కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
భూః అమ్భాంసి అనలో అనిలో అమ్బరమ్ అహః-నాథః హిమాంశుః పుమాన్ ఇతి ఆభ్యాతి చర-అచర-ఆత్మకమ్ ఇదం యస్య ఏవ మూర్త్-అష్టకమ్ । న అన్యత్ కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

అన్వయః-
భూః అమ్భాంసి అనలః అనిలః అమ్బరమ్ అహర్నాథః హిమాంశుః పుమాన్ ఇతి యస్య మూర్త్యష్టకమ్ చరాచరాత్మకమ్ ఇదమ్ ఆభాతి విమృశతామ్ యస్మాత్ విభోః పరస్మాద్ అన్యత్ కిఞ్చన న విద్యతే తస్మై శ్రీగురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః ॥

ప్రతిపదార్థః-
భూః = భూమి
అమ్భాంసి = జలములు
అనలః = అగ్ని
అనిలః = వాయువు
అమ్బరమ్ = ఆకాశము
అహర్నాథః = సూర్యుడు
హిమాంశుః = చంద్రుడు
పుమాన్ = జీవుడు
ఇతి = అనే
యస్య = ఏ పరమాత్మ యొక్క
మూర్తి-అష్టకమ్ = ఎనిమిది మూర్తుల రూపమగు,
చరాచరాత్మకమ్ = స్థావర జంగమాత్మకమైన
ఇదమ్ = ఈ విశ్వము
ఆభాతి = ప్రకాశించుచున్నదో
విమృశతామ్ = ఆత్మజ్ఞానులకు
యస్మాత్ = ఏ
విభోః = సర్వవ్యాపకమగు
పరస్మాత్ = పరబ్రహ్మకంటే
అన్యత్ = మరియొకటి
కిఞ్చన = ఏదియు
న విద్యతే = లేదో
తస్మై = ఆ
శ్రీగురుమూర్తయే = గురు స్వరూపుడయిన
శ్రీదక్షిణామూర్తయే = శ్రీదక్షిణామూర్తి దేవునకు
ఇదం = ఇదియే
నమః = నమస్కారము

🌹తాత్పర్యమ్
    నిర్గుణోపాసనము ఉత్తమాధికారులగు జ్ఞానులకు సాధ్యము. మందాధికారులకు సగుణోపాసనము క్రమముక్తికి ప్రథమ సోపానము. కాని శ్రీశంకర భగవత్పాదులు మందాధికారులను ఉద్దేశించి, అష్టమూర్త్యుపాసనను విధించుచున్నారు. శివుడు మనకు కానరాకుండా ఎక్కడో ఉన్నాడనుట భ్రాంతి.
    శివుడు అష్టమూర్తి. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, అనే పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు అనునవి శివుని ఎనిమిది రూపములు. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయు ఈ ఎనిమిది మూర్తులతో నిండియున్నది. ఆ పరమశివునికంటే వేరుగా ఏదీ లేదు. భౌతిక ప్రపంచము, అనేక రకముల ప్రాణివర్గము ఇదివరలో పుట్టినది, ఇప్పుడు పుట్టుచున్నది ఈ సర్వము ఏది కలదో అది ఈ రుద్రుడే, అట్టి రుద్రునకు నమస్కారము.