Thursday, July 26, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - ప్రార్థన - 1 ; श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना-1


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना🌹

१ श्लोकः
🌹मूलम्-
मौनव्याख्याप्रकटितपरब्रह्मतत्त्वं युवानं
वर्षिष्ठान्तेवसदृषिगणैरावृतं ब्रह्मनिष्ठैः ।
आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दरूपं
स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे ॥
🌹पदविभागः-
मौन-व्याख्या-प्रकटित-परब्रह्म-तत्त्वं युवानं वर्षिष्ठ-अन्तेवसद्-ऋषिगणैः आवृतं ब्रह्मनिष्ठैः । आचार्य-इन्द्रं करकलित-चिन्मुद्रम् आनन्द-रूपं स्व-आत्मारामं मुदित-वदनं दक्षिणामूर्तिम् ईडे ॥
🌹अन्वयः-
मौनव्याख्या-प्रकटित-परब्रह्मतत्त्वं युवानं ब्रह्मनिष्ठैः वर्षिष्ठान्तेवसदृषिगणैः आवृतम् आचार्येन्द्रम् करकलित-चिन्मुद्रम् आनन्दरूपं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिम् ईडे ॥
🌹प्रतिपदार्थः-
मौनव्याख्या-प्रकटित-परब्रह्मतत्त्वं >
            मौनव्याख्या- = मौन रूप से की गई व्याख्या
            प्रकटित- = जो स्पष्ट किया गया हो
            परब्रह्मतत्त्वं = जो परब्रह्म का स्वरूप है
युवानं = युवा को, जवान को
ब्रह्म-निष्ठैः = ब्रह्मविचारशील व्यक्तियों के द्वारा
वर्षिष्ठान्तेवसदृषिगणैः >
            वर्षिष्ठ- = अधिक उम्र वाले
            अन्तेवसद्- = शिष्यजन
            ऋषिगणैः = ऋषि समूहों के द्वारा
आवृतम् = घेरे हुए को
आचार्येन्द्रम् = आचार्यों मे श्रेष्ठ
करकलित-चिन्मुद्रम् >
            करकलित- = हाथ के द्वारा शोभित
            चिन्मुद्रं = ज्ञानमुद्रा वाले को
आनन्द-रूपम् = जिसका स्वरूप आनन्द हो, उसे
स्वात्मारामम् = जो अपनी ही आत्मा में मग्न हो, उसे
मुदित-वदनम् = आनन्दित मुख वाले
दक्षिणामूर्तिम् = दक्षिणामूर्ति को
ईडे = स्तुति करता हूँ

तात्पर्यम्-
            परमेश्वर धर्मसंस्थापन के लिए अवतरित होते हैं। धर्म प्रवृत्ति और निवृत्ति रूप द्विविध है। प्रवृत्तिरूप धर्म की रक्षा करने रामादि का अवतार हुए। निवृत्ति रूपधर्म की ज्ञानोपदेश के द्वारा रक्षा करना दक्षिणामूर्ति अवतार का प्रयोजन है। सदाशिव ने गुरु रूप धारण करके कैलास में दक्षिणाभिमुख होकर ज्ञानोपदेश किया। यही दक्षिणामूर्ति अवतार है। दक्षिणामूर्ति नौजवान है। उनके शिष्य सारे मुनि बूढ़े हैं। ज्ञान का उम्र से कोई संबंध नहीं है।
            *तेजसां हि न वयस्समीक्ष्यते*। गुरु शिष्य को जो उपदेश देता है वह प्रभाषण के रूपमें नहीं है। उस ज्ञानोपदेश में बातों का कोई स्थान नहीं है। दक्षिणामूर्ति की प्रसन्न दृष्टि जैसे ही प्रसरित होती है, वैसे ही शिष्यों का अज्ञान नष्ट होकर ज्ञान का आविर्भाव होरहा है। मानवलोक को ज्ञानभिक्षा देने वाले आचार्य महर्षिजन हैं। उन महर्षियों को ज्ञान देनेवाले यह आचार्य है। अतः दक्षिणामूर्ति आचार्येंद्र है। दक्षिणामूर्ति ज्ञानावतार होने के कारण उनका हस्त ज्ञानमुद्रांकित रहता है। लौकिक श्रेयसों को देनेवाले देवताओं के हाथ वरद मुद्रांकित रहते हैं, अलौकिक श्रेयस् मोक्ष को देनेवाले दैवीरूप होने के कारण चिन्मुद्रा को धारण करते हैं। ब्रह्मज्ञान के कारण जनित होने वाले ब्रह्म से अतिरिक्त नहीं है, वह स्वयं भी ब्रह्मस्वरूप ही होने के कारण दक्षिणामूर्ति आनंदरूप हुआ करते है। नित्य समाधि में स्थित होकर परमेश्वर किसका ध्यान करते हैं? स्वात्मस्वरूप को ही ध्याते हैं। अतः वह स्वात्माराम कहलाते हैं। ऐसे दक्षिणामूर्ति के मुखमंडल पर सिवाय आनंद के कुछ और कैसे दिखेगा? अतः वह मुदित वदन है। उस दक्षिणामूर्ति की मैं स्तुति करता हूँ।
 



-----------------------------------------


🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం ప్రార్థన🌹
౧ వశ్లోకము
🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాన్తేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేన్ద్రం కరకలితచిన్ముద్రమానన్దరూపం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥

పదవిభాగః-
మౌన-వ్యాఖ్యా-ప్రకటిత-పరబ్రహ్మ-తత్త్వం యువానం వర్షిష్ఠ-అన్తేవసద్-ఋషిగణైః ఆవృతం బ్రహ్మనిష్ఠైః । ఆచార్య-ఇన్ద్రం కరకలిత-చిన్ముద్రమ్ ఆనన్ద-రూపం స్వ-ఆత్మారామం ముదిత-వదనం దక్షిణామూర్తిమ్ ఈడే ॥

అన్వయః-
మౌనవ్యాఖ్యా-ప్రకటిత-పరబ్రహ్మతత్త్వం యువానం బ్రహ్మనిష్ఠైః వర్షిష్ఠాన్తేవసదృషిగణైః ఆవృతమ్ ఆచార్యేన్ద్రమ్ కరకలిత-చిన్ముద్రమ్ ఆనన్దరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమ్ ఈడే ॥

ప్రతిపదార్థః-
మౌనవ్యాఖ్యా-ప్రకటిత-పరబ్రహ్మతత్త్వం >
    మౌన-వ్యాఖ్యా = మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముచే
    ప్రకటిత = స్పష్టము చేయబడిన
    పరబ్రహ్మతత్త్వం = పరబ్రహ్మము యొక్క స్వరూపము గలిగినట్టి
యువానం = యువకుడయినట్టి
బ్రహ్మ-నిష్ఠైః = బ్రహ్మనిష్ఠులగు
వర్షిష్ఠాన్తేవసదృషిగణైః >
    వర్షిష్ఠ = వ్రుద్ధులగు నట్టియు
    అన్తేవసద్ = శిష్యులయిన
    ఋషి = మహర్షుల
    గణైః = సమూహములచే
ఆవృతమ్ = చుట్టువారబడి యున్న
ఆచార్యేన్ద్రమ్ = ఆచార్యులలో శ్రేష్ఠుడయిన
కరకలిత-చిన్ముద్రమ్ >
    కరకలిత = చేతిలో విలసిల్లుచున్న
    చిన్ముద్రం = జ్ఞానముద్ర గలిగినట్టి
ఆనన్ద-రూపమ్ = ఆనంద స్వరూపుడయినట్టి
స్వాత్మారామమ్ = స్వాత్మానందమును అనుభవించునట్టి
ముదిత-వదనమ్ = ఆనందముతో నిండిన ముఖముగల
దక్షిణామూర్తిమ్ = దక్షిణామూర్తిని
ఈడే = స్తుతించుచున్నాను

🌹తాత్పర్యమ్
పరమేశ్వరుడు ధర్మసంస్థాపన గురించి అవతరించును. ధర్మము ప్రవృత్తి మరియు నివృత్తిరూపమున ద్వివిధము.
ప్రవృత్తిరూప ధర్మమును రక్షించుటకు రామాద్యవతారములు గలిగినవి. నివృత్తి రూపధర్మమును జ్ఞానోపదేశము ద్వారా రక్షించుట దక్షిణామూర్తి అవతారమునకు ప్రయోజనము.సదాశివుడు గురు రూపముదాల్చి కైలాసమున దక్షిణాభిముఖుడై జ్ఞానోపదేశము చేసెను. ఇదియే దక్షిణామూర్తి అవతారము దక్షిణామూర్తి యువకుడు.
ఆయనశిష్యులగు మునులందరుముదుసలులు. జ్ఞానమునకు వయస్సుతో సంబంధము లేదు.
*తేజసాం హి న వయస్సమీక్ష్యతే*. 
గురువు శిష్యునకు చేయు ఉపదేశము ఉపన్యాస రూపమున లేదు. ఆజ్ఞానోపదేశములో మాటలకు తావే లేదు. దక్షిణామూర్తి యొక్క ప్రసన్న దృక్కులు ప్రసరించినంతనే శిష్యుల యొక్క అజ్ఞానము నష్టమై జ్ఞానము ఆవిర్భవించుచున్నది. మానవలోకమునకు జ్ఞానభిక్షనొసగిన ఆచార్యులు మహర్షులు. ఆ మహర్షులకు జ్ఞానమునొసగిన ఆచార్యుడు. గనుక దక్షిణామూర్తి ఆచార్యేంద్రుడు. దక్షిణామూర్తి జ్ఞానావతారము గనుక ఆయన హస్తము జ్ఞానముద్రాంకితమై యుండును. లౌకిక శ్రేయస్సులను ఇచ్చు దేవతల హస్తములు వరద ముద్రాంకితములై యుండును అలౌకిక శ్రేయస్సగు మోక్షము నిచ్చు దైవము గనుక చిన్ముద్రను ధరించును. బ్రహ్మజ్ఞానము వలన జనించు బ్రహ్మకంటే అతిరిక్తముగాదు అదియు బ్రహ్మ స్వరూపమే కావున దక్షిణామూర్తి ఆనందరూపుడు. నిత్యసమాధి స్థితుడగు పరమేశ్వరుడు ఎవరిని ధ్యానించును. స్వాత్మస్వరూపమును. అందువలన ఆయన స్వాత్మారాముడనబడును. ఆ దక్షిణామూర్తి వదనమున ఆనందము తప్ప వేరొకటి ఎట్లు కనపడును. కావున ఆయన ముదిత వదనుడు ఆ దక్షిణామూర్తిని నేను స్తోత్రము చేయుచున్నాను.

No comments:

Post a Comment