Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 7 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - ७


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹

७श्लोकः

🌹मूलम्-
बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्ववस्थास्वपि
व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तस्स्फुरन्तं सदा ।
स्वात्मानं प्रकटीकरोति भजतां यो भद्रया मुद्रया
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
बाल्य-आदिषु अपि जाग्रद् आदिषु तथा सर्वासु अवस्थासु अपि व्यावृत्तासु अनुवर्तमानम् अहम् इति अन्तः स्फुरन्तं सदा । स्व-आत्मानं प्रकटीकरोति भजतां यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
बाल्यादिषु जाग्रदादिषु अपि तथा सर्वासु अवस्थासु अपि व्यावृत्तासु अनुवर्तमानम् सदा अहमिति अन्तः स्फुरन्तं स्वात्मानं भजताम् यः भद्रया मुद्रया प्रकटीकरोति तस्मै गुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदं नमः ॥

🌹प्रतिपदार्थः-
बाल्यादिषु = बचपन, कौमारावस्था, युवावस्था, वार्धक्य, इत्यादि दशाओं में
जाग्रदादिषु = जाग्रत् स्वप्न सुषुप्ति इत्यादि अवस्थाओं में
अपि = भी
तथा = उसी प्रकार
सर्वासु = सभी
अवस्थासु अपि = अवस्थाओं में
व्यावृत्तासु = बदलरहे होने पर
अनुवर्तमानम् = विना परिणाम के सभी में साक्षीरूप रहने पर
सदा = सदैव
अहम् इति = मैं, इसप्रकार
अन्तः = आन्तरिक
स्फुरन्तं = प्रकाशित होने वाले
स्वात्मानं = स्वयं का स्वरूप आत्मा को
भजताम् = भक्तों को
यः = जो
भद्रया = मंगलकारी
मुद्रया = मुद्रा से
प्रकटीकरोति = प्रकटित करता है
तस्मै = ऐसे
गुरुमूर्तये = गुरुस्वरूप के लिए
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार है

🌹तात्पर्यम्-
            मैं ने बाल्यकाल में इसप्रकार किया, कौमारमें वैसा बरताव किया, अब वार्धक्यमें ऐसा व्यवहार कर रहा हूँ,- ऐसा अनुभव सर्वसाधारण है। देह के बाल्य इत्यादि अवस्थाएँ बदले हैं पर, मैं नहीं बदला। अतः बाल्यादि अवस्थायें माला में पुष्पों के समान व्यावृत्त होते हैं। पर माला में धागा के समान मैं अनुवृत्त होता है। अतः नित्य है। इसीप्रकार, जाग्रत्स्वप्न सुषुप्तियों में जो मैं एक हूँ, चाहे देहावस्थाओं में जितने अवस्थाओं में बदलाव आये, तब भी जो नहीं बदला है, वह केवल आत्मा एक ही है। साक्षीरूप प्रकाशित होने वाला आत्मस्वरूप नित्य है।
            यदि ऐसा है, तो यह आत्मतत्त्व चार्वाकादियों ने क्यों नहीं स्वीकारा? इस प्रश्नका समाधान तीसरा पाद है। प्रत्यभिज्ञा सर्वानुभव सिद्ध होकर भी, आत्मज्ञान उन्हीं को प्राप्त होता है जिनका परमेश्वरानुग्रह रहता है। आत्मज्ञान अंतःकरण शुद्धि के द्वारा प्राप्त होता है। अंतःकरण संशुद्धि वेदोक्त कर्माचरणों द्वारा प्राप्त होता है। अतः ‘भजताम्’ अर्थात् भक्तों को अर्थात् वेदोक्त कर्मानुष्ठाताओं के अंतःकरण संशुद्धि, उसके द्वारा मोक्ष को मैं प्रदान करूंगा, ऐसा श्रीदक्षिणामूर्ति चिन्मुद्रा के द्वारा प्रकटित करता है॥
-----------------------------------------
 

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం🌹
౭వశ్లోకము

🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యన్తస్స్ఫురన్తం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
బాల్య-ఆదిషు అపి జాగ్రద్ ఆదిషు తథా సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు అనువర్తమానమ్ అహమ్ ఇతి అన్తః స్ఫురన్తం సదా । స్వ-ఆత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

అన్వయః-
బాల్యాదిషు జాగ్రదాదిషు అపి తథా సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు అనువర్తమానమ్ సదా అహమితి అన్తః స్ఫురన్తం స్వాత్మానం భజతామ్ యః భద్రయా ముద్రయా ప్రకటీకరోతి తస్మై గురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః ॥

ప్రతిపదార్థః-
బాల్యాదిషు = బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, మున్నగు దశలు
జాగ్రదాదిషు = జాగ్రద్, స్వప్న, సుషుప్తి మొదలగు అవస్థలు
అపి = కూడా
తథా = అదే విధముగా
సర్వాసు = సకములయిన
అవస్థాసు అపి = చూచుట, స్పృశించుట మొదలగు అనుభవములు కూడ
వ్యావృత్తాసు = మారుచుండగా
అనువర్తమానమ్ = మార్పు లేకుండ అన్నిటి యందు సాక్షిగా ఉన్నట్టియు
సదా = అన్ని అవస్థలయందు
అహమ్ ఇతి = నేను అని
అన్తః = లోపల
స్ఫురన్తం = ప్రకాశించుచున్న
స్వాత్మానం = తన స్వరూపమగు ఆత్మను
భజతామ్ = భక్తులకు
యః = ఏ దక్షిణామూర్తి
భద్రయా = మంగళకరమగు
ముద్రయా = జ్ఞానముద్రతో
ప్రకటీకరోతి = ప్రకటించుచున్నాడో
తస్మై = ఆ
గురుమూర్తయే = గురుస్వరూపమగు
శ్రీదక్షిణామూర్తయే = శ్రీదక్షిణామూర్తిదేవునికి
ఇదం = ఇదియే
నమః = నమస్కారము

🌹తాత్పర్యమ్
    నేను బాల్యములో అట్లు చేసితిని కౌమారములో అట్లు వర్తించితిని. ఇపుడు వార్ధక్యములో ఇట్లు వర్తించుచున్నాను. అనే అనుభవము సర్వసాధారణము. దేహమునకు బాల్యము మొదలగు అవస్థలు మారినవి కాని, నేను మారలేదు. కావున బాల్యాదులు మాలయందలి పుష్పముల వలే వ్యావృత్తములు. కాని మాల యందలి దారము వలే నేను అనునది అను వృత్తము. అందుచే నిత్యము. ఇటులనే, జాగ్రత్స్వప్న సుషుప్తులయందు ఉన్న నేను ఒక్కటే దేహావస్థలలో ఎన్ని అవస్థలలో మార్పువచ్చినను మారనిది ఆత్మ ఒక్కటే. సాక్షిరూపముగా ప్రకాశించునది అగు ఆత్మస్వరూపము నిత్యము.
    అయినచో ఈ ఆత్మతత్త్వమును చార్వాకాదులు ఏల గ్రహించలేదు. ఈ ప్రశ్నకు సమాధానము మూడవ పాదము. ప్రత్యభిజ్ఞ సర్వానుభవ సిద్ధమయినను, ఆత్మజ్ఞానము పరమేశ్వరానుగ్రహమున్న వాళ్ళకే కలుగును. ఆత్మజ్ఞానము అంతఃకరణ శుద్ధి వలన కలుగును. అంతఃకరణ సంశుద్ధి వేదోక్త కర్మాచరణవల్ల కలుగును. కావున భజతామ్ అనగా భక్తులకు అనగా వేదోక్త కర్మానుష్ఠాతలకు అంతఃకరణ సంశుద్ధిని, తద్వారా మోక్షమును నేను ప్రసాదించెదను అని శ్రీదక్షిణామూర్తి చిన్ముద్ర ద్వారా ప్రకటించుచున్నాడు.

No comments:

Post a Comment