Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 6 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - ६



🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹

६श्लोकः

🌹मूलम्-
राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात्
सन्मात्रः करणोपसंहरणतो योऽभूत् सुषुप्तः पुमान् ।
प्रागस्वाप्समिति प्रभोधसमये यः प्रत्यभिज्ञायते
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
राहु-ग्रस्त-दिवाकर-इन्दु-सदृशः माया-समाच्छादनात् सत्-मात्रः करणोपसंहरणतो यः अभूत् सुषुप्तः पुमान् । प्राग् अस्वाप्सम् इति प्रभोध-समये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
मायासमाच्छादनात् राहुग्रस्त-दिवाकरेन्दुसदृशः यः पुमान् सुषुप्तः करणोपसंहरणतः सन्मात्रः अभूत् यः प्रबोधसमये अप्वाप्सम् इति प्रत्यभिज्ञायते तस्मै गुरुमार्तये श्रीदक्षिणामूर्तये इदं नमः ॥

🌹प्रतिपदार्थः-
माया-समाच्छादनात् = माया के द्वारा
राहुग्रस्त-दिवाकरेन्दुसदृशः >
            राहु-ग्रस्त = राहु से जकड़ा हुआ
            दिवाकर-इन्दु-सदृशः = सूर्य चंद्र के समान
यः पुमान् = जो पूर्ण आत्मस्वरूप
सुषुप्तः = निद्रित
करण-उपसंहरण-तः = इन्द्रिय व्यापार उपसंहरित
सत्-मात्रः = सत्तामात्र स्वरूप दिखने वाले
अभूत् = हो गया
यः = जो
प्रबोध-समये = नींद से उठने के समय
अस्वाप्सम् = सोरहा था
इति = ऐसा
प्रत्यभिज्ञायते = जानलेता है
तस्मै = उस के लिए
गुरुमार्तये = गुरुरूप के लिए
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार है

🌹तात्पर्यम्-
            देहमें परमात्म है। पर निद्रा समयमें दृष्टिगोचर नहीं होता। पूर्णग्रहण कालमें गूढ जगत् सारा अंधकारमय होजाता है। तब सूर्य या चंद्र नहीं है, ऐसा कहना अविवे है। सूर्य या चंद्र राहुच्छाया से आच्छादित हैं। इसी प्रकार, निद्रा समयमें भी अज्ञान के द्वारा आच्छादित सत्तामात्र स्वरूप जीव है। पर दृष्टिगोचर नहीं होता। निद्रा में आत्मा है, यह कहने के लिए प्रत्यभिज्ञा निदर्शन के रूप में दिया गया है। व्यक्ति निद्रा से उठने के बाद कहता है कि मैं सुख से सोया था। इसप्रकार निद्रासुख को ग्रहीत करने वाला चैतन्य निद्रा समयमें भी है। अतः ऐसा ज्ञान होरहा है। इंद्रिय व्यापार का उपसंहार होकर निद्रावस्था को प्राप्त होने पर व्यक्ति जगत् रहित स्थितिका अनुभव करता है। यही अनुभव निद्रा से उठने के बाद प्रत्यभिज्ञा का मूल होरहा है
-----------------------------------------
 

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్🌹
౬వ శ్లోకము

🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
రాహుగ్రస్తదివాకరేన్దుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్ సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రభోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
రాహు-గ్రస్త-దివాకర-ఇన్దు-సదృశః మాయా-సమాచ్ఛాదనాత్ సత్-మాత్రః కరణోపసంహరణతో యః అభూత్ సుషుప్తః పుమాన్ । ప్రాగ్ అస్వాప్సమ్ ఇతి ప్రభోధ-సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

అన్వయః-
మాయాసమాచ్ఛాదనాత్ రాహుగ్రస్త-దివాకరేన్దుసదృశః యః పుమాన్ సుషుప్తః కరణోపసంహరణతః  సన్మాత్రః అభూత్ యః ప్రబోధసమయే అప్వాప్సమ్ ఇతి ప్రత్యభిజ్ఞాయతే తస్మై గురుమార్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః ॥

ప్రతిపదార్థః-
మాయా-సమాచ్ఛాదనాత్ = మాయ కప్పివేయుట వలన
రాహుగ్రస్త-దివాకరేన్దుసదృశః >
    రాహు-గ్రస్త = (గ్రహణకాలమున) రాహువుచే కప్పివేయబడిన
    దివాకర-ఇన్దు-సదృశః = సూర్య చంద్రులను పోలియున్న
యః పుమాన్ = ఏ పూర్ణ ఆత్మస్వరూపుడు
సుషుప్తః = నిద్రించినవాడై
కరణ-ఉపసంహరణ-తః  =  ఇంద్రియ వ్యాపారములు ఉపసంహరింపబడుట వలన
సత్-మాత్రః = సత్తామాత్ర స్వరూపుడుగా గోచరించువాడై
అభూత్ = ఆయెనో
యః = ఏ వ్యక్తి
ప్రబోధ-సమయే = నిద్ర లేచిన సమయమందు
అస్వాప్సమ్ = నిద్రించితిని
ఇతి = అని
ప్రత్యభిజ్ఞాయతే = ప్రత్యభిజ్ఞను పొందుచున్నాడో
తస్మై = ఆ
గురుమార్తయే = గురు స్వరూపుడయిన
శ్రీదక్షిణామూర్తయే = దక్షిణా మూర్తిదేవునకు
ఇదం = ఇదియే
నమః, = నమస్కారము

🌹తాత్పర్యమ్
    దేహమునందు పరమాత్మ ఉన్నాడు. కాని నిద్రా సమయమునందు గోచరించుట లేదు. పూర్ణగ్రహణ కాలమున గూఢ జగత్తంతయు అంధకారమగును. అపుడు సూర్యుడు లేక చంద్రుడు లేరనుట అవివేకము. సూర్యుడు లేక చంద్రుడు రాహుచ్ఛాయా చ్ఛాదితులై ఉన్నారు. అటులనే, నిద్రా సమయమందు కూడా అజ్ఞానముచే ఆచ్ఛాదితుడై సత్తామాత్ర స్వరూపుడై ఉన్నాడు. గోచరించుట లేదు. నిద్రయందు ఆత్మ ఉన్నది అనుటకు ప్రత్యభిజ్ఞ తార్కాణముగ నీయబడినది. వ్యక్తి నిద్ర లేచిన తరువాత ‘నేను సుఖముగ నిద్రించితిని’ అనును. ఈలాగున నిద్రాసుఖమును గ్రహించే చైతన్యము నిద్రా సమయమందు గూడ ఉన్నది. అందువలన ఇట్టి ఎరుక గలుగుచున్నది. ఇంద్రియ వ్యాపారములు ఉపసంహరించబడి నిద్రావస్థను చెందినపుడు వ్యక్తి జగత్తులేని స్థితిని అనుభవించుచున్నాడు. ఈ అనుభవమే నిద్రలేచిన తరువాత ప్రత్యభిజ్ఞకు మూలము.

No comments:

Post a Comment