Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 3 श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - 3


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹
३श्लोकः
🌹मूलम्-
यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते
साक्षात्तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् ।
यस्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ
तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥
🌹पदविभागः-
यस्य एव स्फुरणं सत्-आत्मकम् असत्-कल्प-अर्थकं भासते साक्षात् तत्त्वम् असि इति वेद-वचसा यः बोधयति आश्रितान् । यः साक्षात्करणाद् भवेत् न पुनः आवृत्तिः भव-अम्भोनिधौ तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥
🌹अन्वयः-
यस्य सदात्मकं स्फुरणम् एव असत्कल्पार्थकम् भासते, यः तत् त्वम् असिइति वेदवचसा आश्रितान् बोधयति, यत् साक्षात्करणात् भवाम्भोनिधौ पुनरावृत्तिः न भवेत्- तस्मै गुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदम् नमः ॥
🌹प्रतिपदार्थः-
यस्य = जिसका
सदात्मकं = सद्रूपात्मक,
स्फुरणं एव = चैतन्य ही
असत्कल्पार्थकम् = असद्रूप घटपटादि के रूप में
भासते = भासित होता है
यः = जो परमेश्वर
तत्त्वम् असि इति = तुम ही सत्य हो ऐसा
वेदवचसा = वेदवाक् से
आश्रितान् = भक्तों को उद्दिष्ट करके
बोधयति = बोध करता है
यत् = जिस आत्म तत्त्व का
साक्षात्करणात् = साक्षात्कार के कारण
भवाम्भोनिधौ = संसार समुद्र में
पुनरावृत्तिः = पुनः प्रवेश
न भवेत् = नही हो
तस्मै = उस के लिए
गुरुमूर्तये = गुरुस्वरूप
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदम् = यह
नमः = नमस्कार है
🌹तात्पर्यम्-
            जगत् केवल दिखता है, पर वास्तव में होता नहीं है। जगत् प्रकाशित किया जाता है, पर स्वयं प्रकाशित होनेवाला नहीं है। सद्रूप चैतन्य घन आत्मा में जगत् रज्जु में सर्प के समान अध्यस्त होता है अर्तात् सद्रूप चैतन्यघन आत्मा ही जगत् के समान भासित होरहा है। अतः जगत् और उसका नानात्व कल्पित है। यही विषय बृहदारण्यकोपनिषत् में वर्णित हुआ है- नेह नानास्ति किञ्चन। यही इस श्लोक के प्रथम पादमें प्रतिपादित किया गया।
            जगत् सत्य है, देहादि को आत्म समझने वाले अज्ञान के कारण जीव को संसार अनुभूत हो रहा है। परमेश्वर अपने भक्तों को गुरुरूपमें तत्त्वमसीत्यादि वेदांत वाक्यों की बोध कराके, अज्ञान को निकालते हैं। अपरोक्षानुभूति दिलाते हैं। ऐसे गुरूपदेश दुर्लभ है।
            पुरातन सुकृत के प्रभाव से साधक जब ऐसे गुरूपदेश को पाता है, उसका अज्ञान नष्ट होजाता है। अज्ञान जनित संसार भी अज्ञान के साथ ही नष्ट होजाता है। जनन मरण रूपी संसार चक्र भ्रमण निकलजाता है। जिसने ऐसे ज्ञान को पाया, उसे निगमों ने ऐसे स्तुति की।
            ‘तरति शोकमात्मवित्’- आत्मा को जो जान जाता है, वह दुःख को तरजाता है। ‘ब्रह्मविद् ब्रह्मैवभवति’- ब्रह्म जानने वाला ब्रह्म ही होता है। ‘न स पुनरावर्तते’- आत्मज्ञानी पुनः जन्म नही लेता है।
-----------------------------------------
 

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం🌹
౩వ శ్లోకం

🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవామ్భోనిధౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
యస్య ఏవ స్ఫురణం సత్-ఆత్మకమ్ అసత్-కల్ప-అర్థకం భాసతే సాక్షాత్ తత్త్వమ్ అసి ఇతి వేదవచసా యః బోధయతి ఆశ్రితాన్ । యః సాక్షాత్కరణాద్ భవేత్ న పునః ఆవృత్తిః భవ-అమ్భోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

అన్వయః-
యస్య సదాత్మకం స్ఫురణమ్ ఏవ అసత్కల్పార్థకమ్ భాసతే, యః ‘తత్ త్వమ్ అసి’ ఇతి వేదవచసా ఆశ్రితాన్ బోధయతి, యత్ సాక్షాత్కరణాత్ భవామ్భోనిధౌ పునరావృత్తిః న భవేత్- తస్మై గురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదమ్ నమః ॥

ప్రతిపదార్థః-
యస్య = ఏ పరమాత్మ యొక్క
సదాత్మకం = సద్రూపమయిన
స్ఫురణం ఏవ = చైతన్యమే
అసత్కల్పార్థకమ్ = అసద్రూపములయిన ఘటపటాదులుగా
భాసతే = భాసించిచున్నదో
యః = ఏపరమేశ్వరుడు
తత్త్వమ్ అసి ఇతి = పరమ సత్యము నీవే అయి ఉన్నావు అను
వేదవచసా = వేదవాక్కుతో
ఆశ్రితాన్ = భక్తులను ఉద్దేశించి
బోధయతి = బోధించుచున్నాడో
యత్ = ఏ ఆత్మతత్త్వము యొక్క
సాక్షాత్కరణాత్ = సాక్షాత్కారము వలన
భవామ్భోనిధౌ = సంసార సముద్రమునందు
పునరావృత్తిః = మరల ప్రవేశించుట
న భవేత్ = కలుగదో
తస్మై = ఆ
గురుమూర్తయే = గురుస్వరూపుడగు
శ్రీదక్షిణామూర్తయే = శ్రీదక్షిణామూర్తికి
ఇదమ్ = ఇదే
నమః = నమస్కారము

🌹తాత్పర్యమ్
    జగత్తు కనబడేదే గాని వాస్తవముగా ఉన్నది గాదు. జగత్తు ప్రకాశింపచేయబడేదే గాని స్వయముగా ప్రకాశించునది కాదు. సద్రూపము చైతన్య ఘనము అగు ఆత్మయందు జగత్తు రజ్జువునందు సర్పము వలే అధ్యస్తము అనగా సద్రూపము చైతన్యఘనము అగు ఆత్మయే జగత్తు వలే భాసించుచున్నది. కనుక జగత్తు దానిలోని నానాత్వము కల్పితములు. ఈ విషయమునే ‘నేహ నానాస్తి కించన’ అను బృహదారణ్యకోపనిషత్తు వర్ణించినది. దీనినే ఈ శ్లోకపు మొదటిపాదము ప్రతిపాదించినది.
    జగత్తు సత్యము, దేహాదికము ఆత్మ అను అజ్ఞానము వలన జీవునకు సంసారము కలుగుచున్నది. పరమేశ్వరుడు తన భక్తులకు గురు రూపమున తత్త్వమసీత్యాది వేదాంత వాక్యములను బోధించి, అజ్ఞానమును తొలగించును. అపరోక్షానుభూతి కలిగించును. ఇట్టి గురూపదేశము దుర్లభము.
    పురాతన సుకృత ప్రభావముచే సాధకుడు అట్టి గురూపదేశమును పొందిననాడు అతని అజ్ఞానము నశించును. అజ్ఞాన జనిత సంసారము కూడ అజ్ఞానముతో పాటే నశించును జనన మరణ రూపమగు సంసార చక్రభ్రమణము తొలగును. అట్టి జ్ఞానము పొందినవానిని నిగమములిట్లు స్తుతించినవి.
    తరతి శోకమాత్మవిత్- ఆత్మను తెలుసుకున్నవాడు దుఃఖమును తరించి వేయును. బ్రహ్మవేద బ్రహ్మైవభవతి-బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగును. న స పునరావర్తతే- ఆత్మజ్ఞాని మరల జన్మించడు.

No comments:

Post a Comment