Thursday, July 26, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - ప్రార్థన- 5 श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना - 5


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना🌹

५श्लोकः 

🌹मूलम्-
ओं नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये ।
निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॥

🌹पदविभागः-
ओं नमः प्रणव-अर्थाय शुद्ध-ज्ञान-एक-मूर्तये । निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॥

🌹अन्वयः-
ओं प्रणवार्थाय नमः। शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॥

🌹प्रतिपदार्थः-
प्रणवार्थाय = जो ओंकार का अर्थ है, उसके लिए
शुद्धज्ञानैक-मूर्तये = जो जड़ताविहीन ज्ञान का स्वरूप है, उसके लिए
निर्मलाय = जो दोषरहित है, उसके लिए
प्रशान्ताय = जो शान्त है, उसके लिए
दक्षिणामूर्तये = दक्षिणामूर्ति को
नमः = नमस्कार है

🌹तात्पर्यम्
जो ब्रह्मा विष्णु महेश्वरात्मक ओंकार के द्वारा प्रतिपाद्य है, वह परब्रह्म ही दक्षिणामूर्ति है। शुद्ध यानी जड़ता विहीन होना । ब्रह्मचैतन्य स्वरूप होना। चैतन्य में जड़ता नहीं होती। सारा ज्ञान चैतन्यमें ही प्रकाशित होता है। ऐसे शुद्धचैतन्य स्वरूप दक्षिणामूर्ति को नमस्कार है

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం ప్రార్థన🌹
౫వశ్లోకము
🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః ॥

పదవిభాగః-
ఓం నమః ప్రణవ-అర్థాయ శుద్ధ-జ్ఞాన-ఏక-మూర్తయే । నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః ॥

అన్వయః-
ఓం ప్రణవార్థాయ నమః. శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః ॥

ప్రతిపదార్థః-
ప్రణవార్థాయ = ఓంకారము యొక్క అర్థమైనట్టియు
శుద్ధజ్ఞానైక-మూర్తయే = జాడ్యము లేని జ్ఞానమే స్వరూపముగా గలిగిన
నిర్మలాయ = దోష రహితుడును
ప్రశాన్తాయ = ప్రసన్న రూపుడును అగు
దక్షిణామూర్తయే = దక్షిణామూర్తి దేవునకు
నమః = నమస్కారము

🌹తాత్పర్యము
బ్రహ్మవిష్ణు మహేశ్వరాత్మకమగు ఓంకార ప్రతిపాద్యమగు పరబ్రహ్మమే దక్షిణామూర్తి. శుద్ఢమనగా జాడ్యము లేకుండుట. బ్రహ్మచైతన్య స్వరూపము. చైతన్యమునందు జాడ్యముండదు. జ్ఞానమంతయు చైతన్యమునందే ప్రకాశించును. అట్టి శుద్ధచైతన్య స్వరూపమగు దక్షిణామూర్తికి నమస్కారము.

1 comment: