Thursday, July 26, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - ప్రార్థన- 3 ; श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना - 3


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना - 3🌹

३श्लोकः

🌹मूलम्-
चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्या गुरुर्युवा ।
गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः ॥

🌹पदविभागः-
चित्रं वटतरोः मूले वृद्धाः शिष्याः गुरुः युवा । गुरोः तु मौनं व्याख्यानं शिष्याः तु छिन्न-संशयाः ॥

🌹अन्वयः-
चित्रं, वटतरोः मूले शिष्याः वृद्धाः (सन्ति) गुरुः युवा (अस्ति)। गुरोः व्याख्यानं मौनं (भवति)। शिष्याः तु छिन्नसंशयाः (भवन्ति)

🌹प्रतिपदार्थः-
चित्रं = आश्चर्य है
वट-तरोः = बरगद के पेड़ के
मूले = मूल में
शिष्याः = शिष्यजन
वृद्धाः = बूढ़े
गुरुः = गुरु
युवा = नौजवान
गुरोः = गुरु के
व्याख्यानं = व्याख्या, विषय विस्तार करना
मौनं = मौन (रूप) है
शिष्याः = शिष्य जन
छिन्न-संशयाः = जिनके सन्देह सारे दग्ध होगए हों

🌹तात्पर्यम्-
तीनों लोकों में इतना विचित्र गुरुशिष्य गण दिखाई नहीं देता। क्यों कि गुरु दक्षिणामूर्ति युवा है। और शिष्य महर्षिजन बूढ़े हैं। मौन ही गुरु की व्याख्या है। यानी गुरु कुछ भी विवरण करके नहीं बता रहे हैं। पर शिष्यों के पूर्व समय के सारे संदेह मिट रहे हैं। ज्ञानवृद्धता मुख्य है। वयोवृद्धता अमुख्य है। “गुणाः पूजास्थानं गुणिषु न च वयः” यह भवभूति का वचन है। गुणवानों का आदरण गुणों के आधार पर ही होता है, न कि पुरुष है या स्त्री है ऐसा लिंग के, आयु के आधार पर नहीं
 


🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం ప్రార్థన🌹
౩వశ్లోకము

🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
చిత్రం వటతరోర్మూలే వృద్ధాశ్శిష్యా గురుర్యువా ।
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః ॥

పదవిభాగః-
చిత్రం వటతరోః మూలే వృద్ధాః శిష్యాః గురుః యువా । గురోః తు మౌనం వ్యాఖ్యానం శిష్యాః తు ఛిన్న-సంశయాః ॥

అన్వయః-
చిత్రం, వటతరోః మూలే శిష్యాః వృద్ధాః (సన్తి) గురుః యువా (అస్తి). గురోః వ్యాఖ్యానం మౌనం (భవతి). శిష్యాః తు ఛిన్నసంశయాః (భవన్తి).

ప్రతిపదార్థః-
చిత్రం = ఆశ్చర్యము
వట-తరోః = మర్రిచెట్టుయొక్క
మూలే = మొదట్లో
శిష్యాః = శిష్యులు
వృద్ధాః = వృద్ధులు
గురుః = గురువు
యువా = యువకుడు
గురోః = గురువు యొక్క
వ్యాఖ్యానం = వివరించుట
మౌనం = ,మౌనము
శిష్యాః = శిష్యులు
ఛిన్న-సంశయాః = నశింపచేయబడ్డ సంశయములు గలవారు.

🌹తాత్పర్యమ్
మూడు లోకములలో ఇంత చిత్రమైన గురుశిష్య సందోహముకానబడదు. ఏలయన గురువగు దక్షిణామూర్తి యువకుడు. శిష్యులగు మహర్షులు ముదుసలులు. మౌనమే గురువు యొక్క వ్యాఖ్యానము. అనగా గురువేమియును వివరించి చెప్పుట లేదు. కాని శిష్యులకు ఇతః పూర్వము గల సందేహములన్నియు పటాపంచలగుచున్నవి. జ్ఞానవృద్ధత్త్వము ముఖ్యము. వయోవృద్ధత గౌణము. గుణాః పూజాస్థానం. గుణిషు న చ వయః. అని భవభూతి వచనము. గుణవంతులకు ఆదరణము గుణముల బట్టియే గాని పురుషుడా, స్త్రీయా అనే లింగమును బట్టి గాని వయస్సును బట్టి గాని కాదు.

No comments:

Post a Comment