Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 5 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - ५


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹
५श्लोकः

🌹मूलम्-
देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः
स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः ।
मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
देहं प्राणम् अपि इन्द्रियाणि अपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्री-बाल-अन्ध-जड-उपमाः तु अहम् इति भ्रान्ताः भृशं वादिनः । माया-शक्ति-विलास-कल्पित-महा-व्यामोह-संहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
भ्रान्ताः देहं प्राणम् अपि इंद्रियाणि अपि चलां बुद्धिं शून्यं च अहम्इति विदुः। भृशम् वादिनः, स्त्रीबालान्धजडोपमाः मायाशक्ति-विलासकल्पित-महाव्यामोह-संहारिणे तस्मै गुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदं नमः ॥

🌹प्रतिपदार्थः-
भ्रान्ताः = भ्रान्त होनेवाले
देहम् = शरीर को
प्राणम् अपि = प्राण अपि
इंद्रियाणि अपि = इन्द्रिय भी
चलां बुद्धिं = क्षणिक विज्ञान
शून्यं च = शून्य
अहं = मैं
इति = ऐसा
विदुः = सोचते हैं
भृशम् = बहुत
वादिनः = वाद करने वाले
स्त्रीबालान्धजडोपमाः >
            स्त्रीबाल- = स्त्री, बालक
            अन्ध-जडोपमाः = अन्धे, मन्दबुद्धि
मायाशक्ति-विलासकल्पित-महाव्यामोह-संहारिणे >
            मायाशक्ति- = -मायाशक्ति का
            विलास-कल्पित- = -लीला से
            महा- = -बहुत
            व्यामोह- = -अज्ञान अन्धकार
            संहारिणे = संहारी के लिए
तस्मै = उसके लिए
गुरुमूर्तये = गुरुमूर्तिके लिए
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार

🌹तात्पर्यम्-
            आत्मा क्या है? देह ही आत्म है चार्वाकों वाद है। प्राण ही आत्मा है, बौद्धों में एक विभाग का वाद है। इंद्रिय ही आत्म है ऐसा वादन है। क्षणिक विज्ञान ही आत्म है ऐसा बौद्धों कुछ लोगों का वादन । शून्य ही आत्मा है ऐसा शून्यवादियों का वादन। पहला पादमें चकार के साथ इतर वादों का भी ग्रहण होगा।
            यह सब भ्रांत लोग हैं। अर्थात् वस्तु यादार्थ्य को सही पहचान नहीं पाए। तत्त्वमन्यथा प्रतिपद्यमाना भ्रांताः। इस श्लोक में स्त्रीशब्द के साथ निर्देशित होने स्त्री नहीं। देहाभिमानियों को। उसीप्रकार बच्चे अनगा प्राण ही आत्मा मानने वाले। इंद्रियाभिमानी अंधे, क्षणिक विज्ञान को ही आत्मा कहनेवाले जड के नाम से निर्देशित हुए।
            यह सारे वादी सारे प्रज्ञाशाली हैं न! वे क्यों आत्मस्वरूप को क्यों नहीं जान पाए? एक शंका का समाधान श्लोक में तीसरा पाद है। आत्मज्ञान होने के लिए जो चाहिए वह केवल धीशक्ति ही नहीं। परमेश्वरानुग्रह है।
            क्योंकि माया कल्पित अज्ञान निकल नहीं जाता तब तक वस्तु यादार्थ्य गोचर नहीं होता। परमेश्वरानुग्रह के रहे बिना माया नहीं निकलती । जो उस मायाकल्पित अज्ञान को निकाल दें, ऐसे दक्षिणामूर्ति को नमस्कार है
-----------------------------------------
 

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం🌹
౫వ శ్లోకము

🌹తత్త్వప్రకాశికా టీకా
 
మూలం-
దేహం ప్రాణమపీన్ద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాన్ధజడోపమాస్త్వహమితి భ్రాన్తా భృశం వాదినః ।
మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
దేహం ప్రాణమ్ అపి ఇన్ద్రియాణి అపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ-బాల-అన్ధ-జడ-ఉపమాః తు అహమ్ ఇతి భ్రాన్తాః భృశం వాదినః । మాయా-శక్తి-విలాస-కల్పిత-మహా-వ్యామోహ-సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

అన్వయః-
భ్రాన్తాః దేహం ప్రాణమ్ అపి ఇంద్రియాణి అపి చలాం బుద్ధిం శూన్యం చ ‘అహమ్’ ఇతి విదుః. భృశమ్ వాదినః, స్త్రీబాలాన్ధజడోపమాః మాయాశక్తి-విలాసకల్పిత-మహావ్యామోహ-సంహారిణే తస్మై గురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః ॥

ప్రతిపదార్థః-
భ్రాన్తాః = భ్రాంతిపడినవారు (ఆత్మతత్త్వము విషయములో)
దేహమ్ = దేహమును
ప్రాణమ్ అపి = ప్రాణమును
ఇంద్రియాణి అపి = ఇంద్రియములను
చలాం బుద్ధిం = క్షణికమగు విజ్ఞానమును
శూన్యం చ = శూన్యమును కూడ
అహం = నేను
ఇతి = అని
విదుః = తలపోయుచున్నారు
భృశమ్ = గట్టిగా
వాదినః = వాదించువారు
స్త్రీబాలాన్ధజడోపమాః >
    స్త్రీబాల- = స్త్రీలు, (దేహాభిమానము కలవారు), బాలురు (ప్రాణాభిమానులు)-
    అన్ధ-జడోపమాః = గుడ్డివారు, [ఇంద్రియాభిమానులు,] మందబుద్ధుల (క్షణిక విజ్ఞానులతో పోలిక కలవారు.)
మాయాశక్తి-విలాసకల్పిత-మహావ్యామోహ-సంహారిణే >
    మాయాశక్తి- = మాయాశక్తి యొక్క-
    విలాస-కల్పిత- = లీలచే కల్పించబడిన-
    మహా- = గొప్పదగు-
    వ్యామోహ- = అజ్ఞానాంధకారము-
    సంహారిణే = పోగొట్టునటువంటి
తస్మై = ఆ
గురుమూర్తయే = గురు స్వరూపుడయిన
శ్రీదక్షిణామూర్తయే = శ్రీదక్షిణామూర్తి దేవునకు
ఇదం = ఇదే
నమః = నమస్కారము

🌹తాత్పర్యమ్
    ఆత్మ యనగా నేమి? దేహమే ఆత్మయని చార్వాకుల వాదము. ప్రాణమే ఆత్మయని బౌద్ధులలో ఒక తెగ వాదింతురు. ఇంద్రియములే ఆత్మయని కొందరి వాదన. క్షణికమగు విజ్ఞానమే ఆత్మయని బౌద్ధులలో కొంత మందివాదన .శూన్యమే ఆత్మ యని శూన్యవాదుల వాదన. మొదటి పాదములోని చకారముచే ఇతర వాదములు గూడ గ్రహించబడును.
    వీరందరు భ్రాంతులు. అనగా వస్తు యాదార్థ్యమును సరిగా గ్రహించలేకపోయినవారు. తత్త్వమన్యథా ప్రతిపద్యమానా భ్రాంతాః. ఈ శ్లోకములో స్త్రీశబ్దముచే నిర్దేశించబడేది స్త్రీలను గాదు. దేహాభిమానులను. అట్లే పిల్లలు అనగా ప్రాణమే ఆత్మ అనువారు. ఇంద్రియాభిమానులు గ్రుడ్డివారుగను, క్షణిక విజ్ఞానమే ఆత్మ అనువారు జడులుగను నిర్దేశించబడిరి.
    ఈ వాదులందరు ప్రజ్ఞాశాలురే గదా! వారేల ఆత్మస్వరూపమును తెలియలేకపోయిరి? అను శంకకు సమాధానము శ్లోకములోని మూడవ పాదము. ఆత్మజ్ఞానము కలుగుటకు కావలసినది కేవల ధీశక్తి గాదు. పరమేశ్వరానుగ్రహము.
    ఏలయన మాయా కల్పిత అజ్ఞానము తొలగినగాని వస్తు యాదార్థ్యము గోచరించదు. పరమేశ్వరానుగ్రహము ఉన్నగాని మాయ తొలగదు. మాయాకల్పిత అజ్ఞానము తొలగించెడి దక్షిణామూర్తికి నమస్కారము.

No comments:

Post a Comment