Thursday, July 26, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 1 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - 2


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹

१श्लोकः

🌹मूलम्-
विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं
पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया ।
यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
विश्वं दर्पण-दृश्यमान-नगरी-तुल्यं निज-अन्तर्गतं पश्यन् आत्मनि मायया बहिः इव उद्भूतं यथा निद्रया । यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानम् एव अद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
यः दर्पणदृश्यमान-नगरीतुल्यं निजान्तर्गतं निद्रया यथा मायया बहिः उद्भूतं इव विश्वं आत्मनि पश्यन्, प्रबोधसमये अद्वयं स्वात्मानम् एव साक्षात्कुरुते, तस्मै श्रीगुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदं नमः ॥

🌹प्रतिपदार्थः-
यः = जो
दर्पणदृश्यमाननगरीतुल्यं >
            दर्पण- = आयने में
            दृश्यमान- = (प्रतिबिंबित होकर) दिखाई देनेवाले
            नगरी-तुल्यं = नगर के समान
निजान्तर्गतं >
            निज- = अपना, स्वयं का
            अन्तर्गतम् = अन्तःस्थित को
निद्रया यथा = जैसे नींद के द्वारा, स्वप्नावस्था में
मायया = (सत्त्वरजस्तमोगुणात्मक, आवरण-विक्षेप-शक्तिवाली) माया के द्वारा
बहिः उद्भूतं इव = आत्मा से भिन्न उद्भव हुआ हो, ऐसे
विश्वम् = विश्व को
आत्मनि = अपने अन्तरात्मा में
पश्यन् = देखने वाला
प्रबोध-समये = आत्मबोध के समय में
अद्वयम् = जिसका कोई दूसरा नहीं है
स्वात्मानं एव = जो वह स्वयं है, ऐसी आत्मा को
साक्षात्कुरुते = प्रत्यक्ष करता है
तस्मै = उसके लिए
गुरु-मूर्तये = गुरुस्वरूप के लिए
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदम् = यह
नमः = नमन है

🌹तात्पर्यम्-
            घट, पटादि में घटत्व, पटत्वादि बुद्धियाँ, व्यावृत्त और, व्यभिचार होती हैं [वह हटजानेवाली होतीं हैं] इसीलिए कल्पित हैं। सद्रूप बुद्धि {उपस्थित है ऐसी भावना} घटपटादि समस्त प्रपंच में अनुवृत्त है, नहीं हटने वाली है, अतः, यथार्थ है। सद्रूप आत्मा में असद्रूप जगत् अध्यस्त है। अर्थात् किसी वस्तु को भ्रम के कारण कुछ और समझलेना। यह विषय अद्वैत सिद्धांत की नींव है। श्रीशंकर ने इसी को इस श्लोक में प्रतिपादित किया।
            स्वच्छ दर्पणमें भवन, उपवन, इत्यादि के साथ नगर भासित होता है। आयिने में भासित होने वाले उस वस्तु के आधार नगर की कोई सत्यता नहीं है। साक्षी आत्मा में ही स्वप्नप्रपंच लीन रहता है। पर वह आत्मव्यतिरिक्त (आत्मा से पृथक्) नहीं दिखता। उसीप्रकार अज्ञान का प्रभाव के कारण यह सारा जगत् आत्मा में अध्यस्त है। अर्थात् सर्वव्यापक है। निस्संग है। निर्विकार है। निरंजन है। शुद्ध है। तात्पर्य है कि सद्रूप आत्मा से व्यतिरिक्त जगत् नहीं रहता है।
            इसी कारण से साधक को आत्मज्ञान होने वाले समय में साक्षात्कार होने वाली वस्तु क्या है? वही अद्वितीय आत्मा है। ‘ताने स एकः’- (तैत्तिरीयोपनिषद् ३-१०) इत्यादि श्रुतियों के कारण, ‘ना सतो विद्यते भावो, नाभावो विद्यते सतः’ (--जो दिखता है, उसका अस्तित्व नहीं है। जो है, वह नहीं रहे, ऐसा नहीं होसकता। --श्रीमद्भगवद्गीता २-१६) इत्यादि श्रुतियों के द्वारा प्रतिपाद्य ब्रह्मसत्यत्व, जगन्मिथ्यता इस श्लोक के दर्पणदृश्यमाननगरी-स्वप्नप्रपंच के दृष्टांतों के द्वारा प्रतिपादित हुए हैं। ऐसे ज्ञान से युक्त व्यक्ति ही गुरु है, अथवा आचार्य कहलाता है। ऐसे गुरु श्रीदक्षिणामूर्ति को नमस्कार है॥


-----------------------------------------
 🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రము
౧వశ్లోకము
🌹తత్త్వప్రకాశికా టీకా
మూలం-
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాన్తర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యస్సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ-తుల్యం నిజ-అన్తర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యథా నిద్రయా । యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమ్ ఏవ అద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

అన్వయః-
యః దర్పణదృశ్యమాన-నగరీతుల్యం నిజాన్తర్గతం నిద్రయా యథా మాయయా బహిః ఉద్భూతం ఇవ విశ్వం ఆత్మని పశ్యన్ ప్రబోధసమయే అద్వయం స్వాత్మానమ్ ఏవ సాక్షాత్కురుతే తస్మై శ్రీగురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః ॥

ప్రతిపదార్థః-
యః = ఎవడయితే
దర్పణదృశ్యమాననగరీతుల్యం >
    దర్పణ- = అద్దమునందు
    దృశ్యమాన- = కనుపించు
    నగరీ-తుల్యం = నగరము వంటి
నిజాన్తర్గతం >
    నిజ- = తనయందు
    అన్తర్గతమ్ = అంతర్భూతమగు
నిద్రయా యథా = నిద్ర చేతను వలే
మాయయా = మాయచే
బహిః ఉద్భూతం ఇవ = ఆత్మ వ్యతిరిక్తముగా ఉద్భవించిన దాని వలె భాసించు
విశ్వమ్ = చరాచర ప్రపంచమును
ఆత్మని = ఆత్మయందు
పశ్యన్ = చూచువాడో
ప్రభోద-సమయే = ఆత్మబోధ కలిగిన సమయమందు
అద్వయమ్ = అద్వితీయమైన
స్వాత్మానం ఏవ = తానే అయి ఉన్న ఆత్మస్వరూపమునే
సాక్షాత్కురుతే = సాక్షాత్కరించుకొనునో
తస్మై = అటువంటి
గురు-మూర్తయే = గురుస్వరూపుడయిన
శ్రీదక్షిణామూర్తయే = శోభాయుతుడగు దక్షిణామూర్తికి
ఇదమ్ = ఇదియే
నమః = నమస్కారము
 
🌹తాత్పర్యమ్
ఘట, పటాదుల యందు గల ఘటత్వ, పటత్వాది బుద్ధులు, వ్యావృత్తములు, వ్యభిచారులు [తొలగిపోయేవి] గనుక కల్పితములు. సద్రూప బుద్ధి{ఉన్నది అనే భావన} ఘటపటాది సమస్త ప్రపంచమునందు అనువృత్తము, తొలగిపోనిది అందువలననే, యదార్థము. సద్రూపమగు ఆత్మయందు అసద్రూపమగు జగత్తు అధ్యస్తము. అనగా ఒకదానిని మరియొక దానినిగా భ్రమపడుట. ఈ విషయము అద్వైత సిద్ధాంతమునకు పునాది. శ్రీశంకరులు దీనినే ఈ శ్లోకమునందు ప్రతిపాదించినారు.

స్వచ్ఛమగు దర్పణమునందు సౌధములు, ఉపవనములు, మొదలగు వాటితో గూడి యున్న నగరము భాసించును. అద్దమునందు భాసించే ఆ వస్తుగర్భ యగు నగరికి సత్యత్వము లేదు. స్వప్న ప్రపంచము సాక్షి యగు ఆత్మయందే లీనమై ఉన్నది. కాని అది ఆత్మవ్యతిరిక్తముగా కనపడును. అదే విధముగా అజ్ఞానము యొక్క ప్రభావము వలన ఈ జగత్తంతయు ఆత్మయందు అధ్యస్తము. అనగా సర్వవ్యాపకము. నిస్సంగము. నిర్వికారము. నిరంజనము. శుద్ధము. సద్రూపమగు ఆత్మకంటే వ్యతిరిక్తముగా జగత్తు లేదు అని భావము.

అందువలననే సాధకునకు ఆత్మజ్ఞానము కలుగు సమయమున సాక్షాత్కరించు వస్తువెయ్యది. అద్వితీయమగు ఆత్మయే. తానే స ఏకః-తైత్తిరీయోపనిషద్ ౩-౧౦ ఇత్యాది శ్రుతుల చేతను, నా సతోవిద్యతే భావో, నాభావో విద్యతే
సతః. --కనబడిపోయేదానికి ఉనికి లేదు. ఉన్నది లేకుండా పోదు. --శ్రీమద్భగవద్గీత2—16 ఇత్యాది శ్రుతులచేత ప్రతిపాద్యమగు బ్రహ్మసత్యత్వము, జగన్మిథ్యత్వముము ఈ శ్లోకమునందలి దర్పణ దృశ్యమాననగరీ-స్వప్నప్రపంచము
అనే దృష్టాంతముల ద్వారా ప్రతిపాదించబడినవి. ఇట్టి జ్ఞానము గలవాడే గురువు. లేక ఆచార్యుడనబడును. అట్టి గురువగు శ్రీదక్షిణామూర్తికి నమస్కారము.

No comments:

Post a Comment