Thursday, July 26, 2018

परिचय- పరిచయం


सोमवती अमावास्या (03.06.2019) की ढेर सारी शुभकामनाएँ..🙏🌺💐
दक्षिणामूर्ति स्तोत्र के तेलुगु व्याख्या का मैं ने हिन्दी अनुवाद किया था। उसीको यहाँ प्रस्तुत कर रही हूँ। पदविभाग, अन्वय, प्रतिपदार्थ की विधिकल्पना- मेरी है-- पदार्थ व तात्पर्य तेलुगुसे यथावत् स्वीकृत हैं। इसमें समास शब्दों का जो अर्थविधान है- समझलीजिए, जैसे तड़प रही थी- कि कैसे उसे सुलझायें, तो वह अपने आप सूझा.. और मुझे बहुत बढिया लगा.. इससे शब्द को अटूट रखकर पहला भाग, और नीचे विभाग करके अर्थ- दिये जातें हैं..। सारा मिलाकर भी अर्थ दे सकते हैं- पर अभी उसकी व्यवस्था नहीं की..
हमारे तेलुगु सदस् में एक माँजी श्रीमती शिवकामसुन्दरी जी ने इसे टंकित रूप दिया.. मैं ने लिपिपरिवर्तक से हिन्दी बनाया। और संस्कृतविषय तो कई सारे शब्द मिलेजुले.. अधिक कार्य समय नहीं लगा।

 
अद्वैतवेदांत ‘ब्रह्म सत्यं जगन्मिथ्या’ ऐसा प्रतिपादित कर रहा है। श्रीशंकर अद्वैतसिद्धांत को पुनःप्रतिष्ठित करके जगत् के सामने सनातनधर्मं की पराकाष्ठा का परिचय दिया। उसी तत्त्व को अनेक प्रकारसे पामर जनों के लिए भी उपलब्ध करने के लिए स्तोत्रादि मार्गों में प्रतिपादित करके हमजैसों के लिए महोपकार किया। उसी पंथामें एक अत्यंत उपयोगी स्तोत्र है श्रीदक्षिणामूर्ति स्तोत्र। इस स्तोत्रपठन की महिमा कितनी है कह नहीं सकते।
    श्रीदक्षिणामूर्ति शिवस्वरूप है। विद्याप्रदाता है। उनके आराधन से अविद्या को निकालकर मुक्ति को प्रदान कर सकते हैं। ऐसा वह स्वामी रूप को ध्यान करके, स्तुति करने के अनुरूप, इस स्तोत्र की तेलुगु व्याख्या महामहितात्मा  श्रीतत्त्वविदानंदसरस्वती स्वामी के द्वारा की गई है। उनकी तत्त्वप्रकाशिका टीका के आधार पर इस स्तोत्र को प्रतिपदार्थ सहित तात्पर्य संरचना के साथ पदविभाग, अन्वय, करके संस्कृतार्तों के लिए उपलब्ध कराया जा रहा है। उसी का हिन्दी अनुवाद अब प्रस्तुत किया गया है।
शुभमस्तु।
🌹🌹
तत्त्वविदानंदसरस्वति जी की व्याख्या का हिन्दी अनुवाद--


तो हिन्दी भाषियों के लिए प्रस्तुत है- दक्षिणामूर्ति स्तोत्र। नमो नमः
 ------------------------------
అద్వైతవేదాంతం ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య’ అని ప్రతిపాదిస్తున్నది. శ్రీశంకరులు అద్వైతసిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠ చేసి జగత్తుకు సనాతనధర్మం పరాకాష్ఠను పరిచయం చేశారు. అదే తత్త్వాన్ని అనేక రకాలుగా పామర జనులకోసం కూడా అందుబాటులో ఉండే విధంగా స్తోత్రాది మార్గాలలో ప్రతిపాదించి మనబోటి వారికి మహోపకారం చేశారు. ఆ పంథాలో ఒక అత్యంత అనువైన స్తోత్రం శ్రీదక్షిణామూర్తి స్తోత్రం. ఈ స్తోత్రం పఠన మహిమ ఇంత అని చెప్పలేనిది.
    శ్రీదక్షిణామూర్తి శివస్వరూపం. విద్యాప్రదాత. ఆయనను ఆరాధిస్తే అవిద్యను తొలగించి ముక్తిని ప్రసాదించగలరు. ‘మఱ్ఱిమాను మొదలులో కుర్రవాడ’ని శ్రీసామవేదం షణ్ముఖశర్మగారు చెప్పినట్టు, ‘బుర్రలు పండినవారికి బోధకుడై’ నిలిచాడు. అట్టి ఆ స్వామి రూపాన్ని ధ్యానించి, స్తుతించుకునేందుకు వీలుగా, ఈ స్తోత్రాన్ని తెలుగు వ్యాఖ్యతో అందించినవారు మహామహితాత్ములు శ్రీతత్త్వవిదానందసరస్వతి స్వామివారు. వారి తత్త్వప్రకాశికా టీక ఆధారంగా ఉన్న ఈ స్తోత్ర ప్రతిపదార్థ సహిత తాత్పర్యానికి పదవిభాగం, అన్వయం జోడించి సంస్కృతార్తుల కోసం అందించటమైనది. దీనిని మన సంస్కృతసంస్కృతి కోసం టంకణం చేసి పెట్టిన మాన్య శ్రీమతి బండారు శివకామసుందరి గారికి అనేక శుభాకాంక్షలు, అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మగారు ఎంతో ఓపికతో, శ్రద్ధతో అక్షరదోషాలు లేకుండా చేసినందున దీన్ని సంస్కృతార్థులకు అనువుగా చేసి అందించటంలో నాకు ఎట్టి కష్టమూ కలగలేదు. వారు చేసిన ఈ పని వృథా కాకుండా నెట్ వాడే తెలుగువారికి అందేవిధంగా బ్లాగు చేయటమైనది.
    శ్లోకంతో కూడిన కృతిని చదివే విధానం (కింద అందించిన లేఖలో) చూసుకుని దీన్ని ఆ విధంగా అధ్యయనం చేయవలసింది. నేటి గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఈ కార్యాన్ని సంపన్నం చేయటం నాకెంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తున్నవి. శుభమస్తు.
 ---------------------
🌷 సంస్కృతం శ్లోకం తో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేసే విధానం- 🌷

1.    మొదలు మూల శ్లోకం, తరువాత అదే క్రమంలో మిగిలినదంతా – పదవిభాగాదులను చదవటం.
2.    పూర్తి అయినాక మళ్ళీ విరుద్ధ దిశగా కిందనుండి పైకి చదివటం. అంటే తెలుగు అనువాదం, ప్రతిపదార్థం, అన్వయం – అట్లా.
3.    తరువాత అనువాదంలోని ఫలానా తెలుగు పదం మూలంలో ఎక్కడున్నది- అని ఊహిస్తూ మూలంలోనైనా పదవిభాగంలోనైనా చూసుకోవటం.
4.    సంస్కృతవాక్యం అన్వయక్రమం ప్రకారం తెలుగు అనువాదాన్ని సరిపోల్చుకోవటం. అది ఒకసారి ఇది ఒకసారి చదవటం.
5.    సంధులను పదవిభాగంలోనే శ్లోకాధ్యయనం చివరలో సంధుల దృష్టితో మరోసారి చదవటం మంచిది. (పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, ఈ స్థాయిలో పదాన్ని విడదీసే విధానం తెలిస్తే చాలు)
6.    సమాసాలను ప్రతిపదార్థంలో చదివి సద్వినియోగం చేసుకోవటం మంచిది. (ఈ స్థాయిలో సమాసాల పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, విగ్రహం రాకపోయినా విడదీసే విధానం తెలిస్తే చాలు అని భావం.)
7.    ఏవైనా ప్రయోగవిశేషాలు గమనించటం- ‘ఓహో, ఈ భావాన్ని వ్యక్తపరచాలంటే ఈ పదాన్ని సంస్కృతంలో ఇట్లా వాడతారన్నమాట.. బాగుంది.’ అని నుడికారాన్ని గమనించటం వల్ల భవిష్యత్తులో మంచి లాభం జరుగుతుంది. అవి సూచించే ప్రయత్నం చేయాలని అనుకున్నా. సమయాభావం, మరియు కార్యభారం వల్ల చేయలేకపోయాను. కనుక మీరు స్వయంగా గ్రహించటం, గుర్తించి ప్రయోగాలలో అలవాటు చేసుకోవటం మంచిది.
8.    చివరగా స్వీయపరీక్ష- (లేదా ఎవరి చేతనైనా అడిగించుకోటం)
అ) ఏదైనా సంస్కృతపదాన్ని చదివి, తెలుగు చూడకుండా అర్థం గుర్తు తెచ్చుకోవటం.
ఆ) ఏదైనా తెలుగుపదాన్ని చదివి, సంస్కృతం చూడకుండా మూలపదం గుర్తు తెచ్చుకోవటం.
ఇ) అట్లాగే సంధి, సమాసం చూసుకోవటం
9.    ఇంత చేసేసరికి శ్లోకంలో పదాలన్ని నోటికి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు మరో రెండు మూడు సార్లు చదివేస్తే శ్లోకం నోటికి వచ్చేస్తుంది.
10.    చివ్వరగా సంస్కృతశ్లోకాన్ని చదువుతూ భావాన్ని లోపల అనుకోవటం. ఇక్కడ ఏ పదమూ ఆటంకం కలగకపోతే ఇంక ఆ శ్లోకం మనకు అవగతమైనట్టే.
    ఈ పద్ధతిని మీరిక్కడే కాదు, ఎక్కడైనా ఇతరత్రా కూడా వాడుకోవచ్చు. శ్లోకరూపంలో ఉన్నది, సానువాదం లభించిన ఏ సంస్కృతం గ్రంథాన్ని అయినా ఇట్లాగే చదివి లాభం పొందవచ్చు.
    ఇట్లా చేయటం వల్ల విషయం మొత్తం అవగతమై, సంస్కృతాన్ని మూలంనుంచే ఆనందించి, లాభం పొందుతారని ఆదరిస్తారని ఆశతో-

-మీ సంస్కృతానురాగిణి
సంకా ఉషారాణి

No comments:

Post a Comment