Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 9 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - ९


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹
९श्लोकः

🌹मूलम्-
भूरम्भांस्यनलोनिलोम्बरमहर्नाथो हिमांशुः पुमान्
इत्याभ्याति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् ।
नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभोः
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
भूः अम्भांसि अनलो अनिलो अम्बरम् अहः-नाथः हिमांशुः पुमान् इति आभ्याति चर-अचर-आत्मकम् इदं यस्य एव मूर्ति-अष्टकम् । न अन्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभोः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
भूः अम्भांसि अनलः अनिलः अम्बरम् अहर्नाथः हिमांशुः पुमान् इति यस्य मूर्त्यष्टकम् चराचरात्मकम् इदम् आभाति विमृशताम् यस्मात् विभोः परस्माद् अन्यत् किञ्चन न विद्यते तस्मै श्रीगुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदं नमः ॥

🌹प्रतिपदार्थः-
भूः = धरा
अम्भांसि = जल
अनलः = आग
अनिलः = वायु
अम्बरम् = आकाश
अहर्नाथः = सूरज
हिमांशुः = चाँद
पुमान् = जीव
इति = ऐसा
यस्य = जिसका
मूर्ति-अष्टकम् = आठमूर्ति रूप
चराचरात्मकम् = स्थावर जंगम
इदम् = यह
आभाति = प्रकाशित होता है
विमृशताम् = आत्मज्ञानियों को
यस्मात् = जिससे
विभोः = सर्वव्यापी से
परस्मात् = परब्रह्म से
अन्यत् = अन्य कुछ
किञ्चन = कुछ भी
न विद्यते = नहीं है
तस्मै = उस
श्रीगुरुमूर्तये = श्रीगुरुमूर्ति के लिए
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार है

🌹तात्पर्यम्-
            निर्गुणोपासन उत्तमाधिकारी ज्ञानियों के लिए साध्य है। मंदाधिकारियों के लिए सगुणोपासन क्रममुक्ति का प्रथम सोपान है। पर श्रीशंकर भगवत्पाद मंदाधिकारियों को उद्देशित कर, अष्टमूर्ति उपासना का विधान कर रहे हैं। शिव हमसे दूर, अदृश्य कहीं और है, ऐसा सोचना भ्रांति है।
            शिव अष्टमूर्ति है। भूमि, पानी, हवा, आग, आकाश, यह पंचभूत, सूर्य चंद्र व जीव यह शिव के आठ रूप हैं। स्थावर जंगमात्मक यह जगत् सारा आठ मूर्तियों से भरा हुआ है। उस परमशिव से भिन्न कुछ भी नहीं है। भौतिक प्रपंच, अनेक प्रकार के प्राणिवर्ग, पहले का जन्मा, अब जन्म ले रहे यह सब जो भी है, सब यह रुद्र ही है, ऐसे रुद्र को नमस्कार है
-----------------------------------------
 

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్🌹
౯వశ్లోకము
🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
భూరమ్భాంస్యనలోనిలోమ్బరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభ్యాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్ కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
భూః అమ్భాంసి అనలో అనిలో అమ్బరమ్ అహః-నాథః హిమాంశుః పుమాన్ ఇతి ఆభ్యాతి చర-అచర-ఆత్మకమ్ ఇదం యస్య ఏవ మూర్త్-అష్టకమ్ । న అన్యత్ కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥

అన్వయః-
భూః అమ్భాంసి అనలః అనిలః అమ్బరమ్ అహర్నాథః హిమాంశుః పుమాన్ ఇతి యస్య మూర్త్యష్టకమ్ చరాచరాత్మకమ్ ఇదమ్ ఆభాతి విమృశతామ్ యస్మాత్ విభోః పరస్మాద్ అన్యత్ కిఞ్చన న విద్యతే తస్మై శ్రీగురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః ॥

ప్రతిపదార్థః-
భూః = భూమి
అమ్భాంసి = జలములు
అనలః = అగ్ని
అనిలః = వాయువు
అమ్బరమ్ = ఆకాశము
అహర్నాథః = సూర్యుడు
హిమాంశుః = చంద్రుడు
పుమాన్ = జీవుడు
ఇతి = అనే
యస్య = ఏ పరమాత్మ యొక్క
మూర్తి-అష్టకమ్ = ఎనిమిది మూర్తుల రూపమగు,
చరాచరాత్మకమ్ = స్థావర జంగమాత్మకమైన
ఇదమ్ = ఈ విశ్వము
ఆభాతి = ప్రకాశించుచున్నదో
విమృశతామ్ = ఆత్మజ్ఞానులకు
యస్మాత్ = ఏ
విభోః = సర్వవ్యాపకమగు
పరస్మాత్ = పరబ్రహ్మకంటే
అన్యత్ = మరియొకటి
కిఞ్చన = ఏదియు
న విద్యతే = లేదో
తస్మై = ఆ
శ్రీగురుమూర్తయే = గురు స్వరూపుడయిన
శ్రీదక్షిణామూర్తయే = శ్రీదక్షిణామూర్తి దేవునకు
ఇదం = ఇదియే
నమః = నమస్కారము

🌹తాత్పర్యమ్
    నిర్గుణోపాసనము ఉత్తమాధికారులగు జ్ఞానులకు సాధ్యము. మందాధికారులకు సగుణోపాసనము క్రమముక్తికి ప్రథమ సోపానము. కాని శ్రీశంకర భగవత్పాదులు మందాధికారులను ఉద్దేశించి, అష్టమూర్త్యుపాసనను విధించుచున్నారు. శివుడు మనకు కానరాకుండా ఎక్కడో ఉన్నాడనుట భ్రాంతి.
    శివుడు అష్టమూర్తి. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, అనే పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు అనునవి శివుని ఎనిమిది రూపములు. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయు ఈ ఎనిమిది మూర్తులతో నిండియున్నది. ఆ పరమశివునికంటే వేరుగా ఏదీ లేదు. భౌతిక ప్రపంచము, అనేక రకముల ప్రాణివర్గము ఇదివరలో పుట్టినది, ఇప్పుడు పుట్టుచున్నది ఈ సర్వము ఏది కలదో అది ఈ రుద్రుడే, అట్టి రుద్రునకు నమస్కారము.

No comments:

Post a Comment