Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 4 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - 4


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹

४श्लोकः

🌹मूलम्-
नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं
ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्स्पन्दते ।
जानामीति तमेव भान्तमनुभात्येतत् समस्तं जगत्
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
नाना च्छिद्र-घट-उदर-स्थित-महा-दीप-प्रभा-भास्वरं ज्ञानं यस्य तु चक्षुः-आदि-करण-द्वारा बहिः स्पन्दते । जानामि इति तम् एव भान्तम् अनुभाति एतत् समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
यस्य ज्ञानं तु नानाच्छिद्र-घटोदरस्थितमहादीपप्रभाभास्वरम् चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामि इति तम् एव अनु एतत् समस्तम् जगत् भाति तस्मै गुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदं नमः

🌹प्रतिपदार्थः-
यस्य = जिस परमात्मा
ज्ञानं तु = चैतन्य
नानाच्छिद्र-घटोदर-स्थित-महादीप-प्रभा-भास्वरम् >
            नानाच्छिद्र- = -बहु रन्ध्र
            घटोदरस्थित- = -घड़े के अन्दर
            -महादीपप्रभाभास्वरम् = दीपकान्ति सभी दिशाओं प्रसारित हो वैसे
चक्षुरादि-करण-द्वारा = आंख आदि ज्ञानेन्द्रिय द्वारा
बहिः = बाहर
स्पन्दते = प्रसरित हो रहा है
जानामि = जान रही हूँ
इति = ऐसा
तम् एव = उसी को
अनु = अनुसरित करके
एतत् = यह
समस्तम् = सकल
जगत् = संसार
भाति = प्रकाशित हो रहा है
तस्मै = उसके लिए
गुरुमूर्तये = गुरुस्वरूप
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार

🌹तात्पर्यम्-
            अनेक रंध्र वाले घट में रखे हुए दीप की कांति उस रंध्रमें से बाहर व्यापित समीपमें स्थित वस्तुओं को प्रकाशित करेगी। उसीप्रकार पाँच ज्ञानेंद्रियों के साथ देह नामकी उपाधि में अंतर्निहित होकर चैतन्यरूप, स्वप्रकाशरूप परमात्मा रहता है। वह परमात्मा के स्वप्रकाश चैतन्यमें इंद्रिय नामके बहिर्द्वार द्वारा प्रसरित होकर घटपटादि वस्तुजाल को, प्रकाश देते हैं। अतः जगत् का प्रकाश स्वप्रकाश नहीं है। आत्मप्रकाश को अनुसरित करके जगत् प्रकाशित होरहा है। आत्मचैतन्य अननुसरित करके ही जगत् चैतन्यमय होरहा है। आँख इत्यादि इंद्रिय भी अंतःकरणविशिष्ट चैतन्य रूप जीव से जब तक संबंध रहे मात्रमें विषय ग्रहण समर्थ होजायेंगे॥
-----------------------------------------
 

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం🌹
౪వశ్లోకం

🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్స్పన్దతే ।
జానామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్ సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

పదవిభాగః-
నానా చ్ఛిద్ర-ఘట-ఉదర-స్థిత-మహా-దీప-ప్రభా-భాస్వరం జ్ఞానం యస్య తు చక్షుః-ఆది-కరణ-ద్వారా బహిః స్పన్దతే । జానామి ఇతి తమ్ ఏవ భాన్తమ్ అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

అన్వయః-
యస్య జ్ఞానం తు నానాచ్ఛిద్ర-ఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరమ్ చక్షురాదికరణద్వారా బహిః స్పన్దతే జానామి ఇతి తమ్ ఏవ అను ఏతత్ సమస్తమ్ జగత్ భాతి తస్మై గురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః

ప్రతిపదార్థః-
యస్య = ఏ పరమాత్మ యొక్క
జ్ఞానం తు = చైతన్యమే
నానాచ్ఛిద్ర-ఘటోదర-స్థిత-మహాదీప-ప్రభా-భాస్వరమ్ >
    నానాచ్ఛిద్ర- = ఎన్నో రంధ్రములున్న-
    ఘటోదరస్థిత- = కుండలో నున్న-
    మహాదీపప్రభాభాస్వరమ్ = దీపకాంతులన్ని వైపులకు ప్రసరించు విధముగా
చక్షురాది-కరణ-ద్వారా = కన్నులు మొదలగు జ్ఞానేంద్రియముల ద్వారా
బహిః = బయటకు
స్పన్దతే = ప్రసరించుచున్నదో
జానామి = నేను తెలుసుకొనుచున్నాను
ఇతి = అని
తమ్ ఏవ = ఆపరమాత్మనే
అను = అనుసరించి
ఏతత్ = ఈ
సమస్తమ్ = సకలమగు
జగత్ = జగత్తు
భాతి = ప్రకాశించుచున్నదో
తస్మై = ఆ
గురుమూర్తయే = గురుస్వరూపుడయిన
శ్రీదక్షిణామూర్తయే = శ్రీదక్షిణామూర్తికి
ఇదం = ఇదియే
నమః = నమస్కారము

🌹తత్త్వప్రకాశిక
    అనేక రంధ్రములు గల ఘటములో ఉంచబడిన దీపము యొక్క కాంతులు ఆ రంధ్రములో నుండి బయటకు వ్యాపించి సమీపమునందున్న వస్తువులను ప్రకాశింపజేయును. అటులనే అయిదు జ్ఞానేంద్రియములతో కూడియున్న దేహము అనే ఉపాధి యందు అంతర్నిహితమై చైతన్యరూపము, స్వప్రకాశరూపము అగు పరమాత్మ గలడు. ఆ పరమాత్మ యొక్క స్వప్రకాశ చైతన్యమే ఇంద్రియములనే బహిర్ద్వారముల ద్వారా ప్రసరించి ఘటపటాది వస్తుజాలమునకు, ప్రకాశమును ఇచ్చుచున్నవి. కావున జగత్తు యొక్క ప్రకాశము స్వప్రకాశము కాదు. ఆత్మప్రకాశమునుసరించి యే జగత్తు ప్రకాశించుచున్నది. ఆత్మచైతన్యముననుసరించియే జగత్తు చేతనమగుచున్నది. కన్ను మొదలగు ఇంద్రియములు కూడ అంతః కరణవిశిష్ట చైతన్య రూపుడగు జీవునితో సంబంధమున్నంత వరకు మాత్రమే విషయ గ్రహణ సమర్థములగును.

No comments:

Post a Comment