Thursday, July 26, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ -ప్రార్థన - 2 ; श्री दक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना - 2


🌹श्री दक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना - 2 🌹

🌹मूलम्-
२श्लोकः 

वटविटपिसमीपे भूमिभागे निषण्णं
सकलमुनिजनानां ज्ञानदातारमारात् ।
त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं
जननमरणदुःखच्छेददक्षं नमामि ॥

🌹पदविभागः-
वट-विटपि-समीपे भूमि-भागे निषण्णं सकल-मुनि-जनानां ज्ञानदातारम् आरात् । त्रि-भुवन-गुरुम् ईशं दक्षिणामूर्ति-देवं जनन-मरण-दुःख-च्छेद-दक्षं नमामि ॥

🌹अन्वयः-
वटविटपि-समीपे भूमिभागे निषण्णं आरात् सकलमुनिजनानां ज्ञानदातारम् त्रिभुवनगुरुम् ईशम् जननमरण-दुःखच्छेददक्षम् दक्षिणामूर्तिदेवं नमामि ॥

🌹प्रतिपदार्थः-
वट-विटपि-समीपे = बरगद के पेड़ के पास वाले
भूमि-भागे = धरा पर, स्थल में
निषण्णं = बैठे हुए
आरात् = पास में
सकल-मुनि-जनानां = महर्षि जनों को
ज्ञान-दातारम् = आत्मज्ञान देने वाले
त्रिभुवन-गुरुम् = तीनों लोकों के जो गुरु है, उसे
ईशम् = सर्वाधिकारी को
जननमरणदुःखच्छेददक्षम् >
            जनन-मरण- = जन्म और मृत्यु नाम के
            दुःखच्छेद-दक्षम् = दुख को छिन्न करने में समर्थ
दक्षिणामूर्तिदेवं = दक्षिणामूर्ति भगवान को
नमामि = नमन करता हूँ
🌹तात्पर्यम्-
            दक्षिणामूर्ति बरगद के पेड़ के नीचे बैठकर, जिज्ञासा से सामने व घेरकर बैठे हुए महर्षियों को प्रसन्न दृष्टि के प्रसारण के ही द्वारा ज्ञानोदय करवाते हैं। परमशिव के अवतार दक्षिणामूर्ति देव, भूर्भुवस्सुवर्लोक तीनों के गुरु है। भावविकार छह हैं। जायते, अस्ति, वर्धते, विपरिणमते, अपक्षीयते, नश्यति। प्रत्याहार न्याय में, आदि अंत अथवा जनन मरण सारे छहों के उपलक्षक हैं। ज्ञान को प्रसादित करने के द्वारा उनके निवारित करने में समर्थ दक्षिणामूर्ति ही है। उनको नमस्कार करता हूँ
 


🌹శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం ప్రార్థన🌹
౨వ శ్లోకం  
🌹తత్త్వప్రకాశికా టీకా
 
మూలం-
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥

పదవిభాగః-
వట-విటపి-సమీపే భూమి-భాగే నిషణ్ణం సకల-ముని-జనానాం జ్ఞానదాతారమ్ ఆరాత్ । త్రి-భువన-గురుమ్ ఈశం దక్షిణామూర్తి-దేవం జనన-మరణ-దుఃఖ-చ్ఛేద-దక్షం నమామి ॥

అన్వయః-
వటవిటపి-సమీపే భూమిభాగే నిషణ్ణం ఆరాత్ సకలమునిజనానాం జ్ఞానదాతారమ్ త్రిభువనగురుమ్ ఈశమ్ జననమరణ-దుఃఖచ్ఛేదదక్షమ్ దక్షిణామూర్తిదేవం నమామి ॥

ప్రతిపదార్థః-
వట-విటపి-సమీపే = మఱ్రిచెట్టు వద్ద
భూమి-భాగే = చదునైన నేలపై
నిషణ్ణం = కూర్చుని యున్నట్టియు
ఆరాత్ = దగ్గరలో
సకల-ముని-జనానాం = మహర్షి జనులందరికి
జ్ఞాన-దాతారమ్ = ఆత్మజ్ఞానమునొసగుచున్నట్టియు
త్రిభువన-గురుమ్ = ముల్లోకములకు గురువయినట్టియు
ఈశమ్ = సర్వనియామకుడయిన
జననమరణదుఃఖచ్ఛేదదక్షమ్ >
    జనన-మరణ = చావుపుట్టుకలనెడి
    దుఃఖచ్ఛేదదక్షమ్ = దుఃఖములను పోగొట్టుటకు సమర్థుడగు
దక్షిణామూర్తిదేవం = దక్షిణామూర్తి దేవుని
నమామి = నమస్కరించుచున్నాను

🌹తాత్పర్యమ్
    దక్షిణామూర్తి మర్రిచెట్టు కింద కూర్చుండి. జిజ్ఞాసతో తన చుట్టూ ఎదుట కూర్చుండియున్న మహర్షులకు ప్రసన్న దృక్ప్రసారము చేతనే జ్ఞానోదయము గలిగించుచుండెను. పరమశివుని అవతారమగు దక్షిణామూర్తి దేవుడు, భూర్భువస్సువర్లోకములు మూడింటికి గురువు. భావవికారములు ఆరు. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, మరియు నశ్యతి. ప్రత్యాహార న్యాయమున, ఆద్యంతములైన జనన మరణములు ఆరింటికి ఉపలక్షకములు. జ్ఞానమును ప్రసాదించుట ద్వారా వీటిని నివారింపజేయు సమర్థుడు దక్షిణామూర్తియే. ఆయనకు నమస్కరించుచున్నాను.

No comments:

Post a Comment