Thursday, July 26, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - ప్రార్థన- 4, श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना - 4


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - प्रार्थना🌹

४श्लोकः

🌹
मूलम्-
निधये सर्वविद्यानां भिषजे भवरोगिणाम् ।
गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॥

🌹
पदविभागः-
निधये सर्व-विद्यानां भिषजे भव-रोगिणाम् । गुरवे सर्व-लोकानां दक्षिणामूर्तये नमः ॥

🌹
अन्वयः-
सर्वविद्यानां निधये भवरोगिणां भिषजे, सर्वलोकानां गुरवे दक्षिणामूर्तये नमः ॥

🌹
प्रतिपदार्थः-
सर्व-विद्यानां = सभी विद्याओं के
निधये = निधि, संचयस्थान
भव-रोगिणाम् = संसार नाम के रोग से ग्रस्तों के
भिषजे = वैद्य के लिए
सर्व-लोकानां = सभी लोकों के
गुरवे = गुरु के लिए
दक्षिणामूर्तये = दक्षिणामूर्ति के लिए
नमः = नमन है

🌹
तात्पर्यम्
दक्षिणामूर्ति सारी विद्याओं का निधि है। [अतः विद्यार्थियों को दक्षिणामूर्ति उपासना विहित हुआ है। संसार से निवृत्ति ही कैवल्य है। ज्ञान के ही कारण कैवल्य मिलता है। ज्ञानादेव हि कैवल्यम्।] ज्ञानदाता दक्षिणामूर्ति है। अतः संसार के रोग से ग्रस्त लोगों का दक्षिणामूर्ति ही वैद्य है। ऐसे, तीनों लोकों का गुरु, दक्षिणामूर्ति को नमस्कार है

🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం ప్రార్థన🌹
౪వశ్లోకము
🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥

పదవిభాగః-
నిధయే సర్వ-విద్యానాం భిషజే భవ-రోగిణామ్ । గురవే సర్వ-లోకానాం దక్షిణామూర్తయే నమః ॥

అన్వయః-
సర్వవిద్యానాం నిధయే భవరోగిణాం భిషజే, సర్వలోకానాం గురవే దక్షిణామూర్తయే నమః ॥

ప్రతిపదార్థః-
సర్వ-విద్యానాం = విద్యలన్నింటికీ
నిధయే = నిధియైనట్టియు
భవ-రోగిణామ్ = సంసార రోగ గ్రస్తులకు
భిషజే = వైద్యుడగు నట్టియు
సర్వ-లోకానాం = సమస్తలోకములకు
గురవే = గురువగు
దక్షిణామూర్తయే = దక్షిణామూర్తి కొరకు
నమః = నమస్కారము

🌹తాత్పర్యము
దక్షిణామూర్తి విద్యలన్నింటికి నిధి. అందువలననే విద్యార్థులకు దక్షిణామూర్తి ఉపాసనము విహితము. సంసార నివృత్తియే కైవల్యము. జ్ఞానము వలననే కైవల్యము లభ్యమగును. ‘జ్ఞానాదేవ హి కైవల్యమ్’. జ్ఞానదాత దక్షిణామూర్తి. కావున సంసార రోగగ్రస్తులకు దక్షిణామూర్తి వైద్యుడు. మూడు లోకములకు గురువగు అట్టి దక్షిణామూర్తికి నమస్కారము.

No comments:

Post a Comment