Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 2 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - 2


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹

२श्लोकः
🌹मूलम्-
बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः
मायाकल्पितदेशकालकलनावैचित्र्यचित्रीकृतं ।
मायावीव विजृम्भयत्यपि महायोगीव यः स्वेच्छया
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥
🌹पदविभागः-
बीजस्य अन्तः इव अङ्कुरः जगद् इदं प्राक् निर्विकल्पं पुनः माया-कल्पित-देश-काल-कलना-वैचित्र्य-चित्रीकृतं । मायावी इव विजृम्भयति अपि महा-योगीव यः स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥
🌹अन्वयः-
इदम् जगत् प्राक् बीजस्य अन्तः अङ्कुरः इव निर्विकल्पं पुनः मायाकल्पित-देशकालकलनावैचित्र्य-चित्रीकृतम् । यः स्वेच्छया मायावी इव महायोगी इव विजृम्भयति तस्मै श्रीगुरुमूर्तये दक्षिणामूर्तये इदं नमः ॥ 
🌹प्रतिपदार्थः-
इदम् = यह (दिखनेवाला)
जगत् = संसार
प्राक् = (सृष्टि से) पहले
बीजस्य = बीज के
अन्तः = अन्दर (स्थित)
अङ्कुरः इव = अंकुर के समान
निर्विकल्पम् = बिना भेद के
पुनः = फिर (सृष्टि समय में)
मायाकल्पित-देशकालकलनावैचित्र्य-चित्रीकृतम् >
            माया- = माया के द्वारा-
            कल्पित- = कल्पित हुआ-
            देश- = स्थान-
            कालकलना- = समय के कारण घटित होरहे-
            वैचित्र्य- = भेदों-
            -चित्रीकृतम् = विचित्र बनाया गया है
यः = जो परमात्मा
स्वेच्छया = अपने संकल्प से
मायावी इव = जादूवाले के समान
विजृम्भयति = इस संसार को विस्तरित करता है
महायोगी इव = महायोगी के समान
तस्मै = उसके लिए
श्रीगुरुमूर्तये = गुरुस्वरूप के लिए
दक्षिणामूर्तये = दक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार है
🌹तात्पर्यम्-
            जगत्कारण क्या है? वैशेषिक, तार्किक जन परमाणु को जगत्कारण मानते हैं। सांख्य जन प्रधान को जगत्कारण बताते हैं। शून्यवादी, शैव, इसीप्रकार जगत्कारण को अलग अलग विधानों से प्रतिपादित करते हैं। शंकर भगवत्पाद इनके सारे वादों को श्रुति, स्मृति प्रमाण सहित निराकृत करके, आत्मा की ही जगत्कारणता को प्रस्थानत्रयादि भाष्यों में निरूपित किया। इसी विषय को शंकराचार्यजी इस श्लोक में सोदाहरण प्रतिपादित कर रहे हैं।
            बीजमें अंकुर है वृक्षोत्पत्ति से पूर्व शाखायें, पत्ते, पुष्प, फल, पल्लव इत्यादि कोई भेद अंकुर में नहीं हैं। यानी, अंकुर बीज में निर्विकल्परूप से वृक्षोत्पत्ति के पश्चात् शाखादि सारा भेद विस्तरित हो रहा है।
            उसी प्रकार सृष्टिके पूर्व में जगत् आत्मा में निर्विकल्प रूप से है। तब जगत् का नामरूपादि कोई भेद नहीं है। सृष्टि से पूर्व केवल आत्मा ही है। परमात्मा ने माया के प्रभाव से इस जगत् की सृष्टि की। जगत् में तद्द्वारा नामरूपादि भेद माया के द्वारा कल्पित हुए हैं।
            कुलाल (कुम्हार) के घड़े की सृष्टिके लिए चक्रादि साधन आवश्यक हैं। परमात्मा ने किन साधनों से जगत् की सृष्टि की? इस प्रश्नके समाधान ही ‘स्वेच्छया’ पद है। सिद्धसंकल्प वाले परमात्मा ने स्वसंकल्पमात्र से जगत् की सृष्टि की। ऐंद्रजालिक (जादूगर) किसी भी वस्तु की सहायता के बिना विचित्र वस्तुओं को सृजित करता है। क्या विश्वामित्रादि महायोगीजनों ने किसी भी वस्तु संचय के बिना ही योगप्रभाव से त्रिशंकुस्वर्गादि की सृष्टि नहीं की?
-----------------------------------------
🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం🌹
౨వశ్లోకం

🌹తత్త్వప్రకాశికా టీకా
 
మూలం-
బీజస్యాన్తరివాఙ్కురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతం ।
మాయావీవ విజృమ్భయత్యపి మహాయోగీవ యస్స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥
 
పదవిభాగః-
బీజస్య అన్తః ఇవ అఙ్కురః జగద్ ఇదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా-కల్పిత-దేశ-కాల-కలనా-వైచిత్ర్య-చిత్రీకృతం । మాయావీ ఇవ విజృమ్భయతి అపి మహా-యోగీ ఇవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥
 
అన్వయః-
ఇదమ్ జగత్ ప్రాక్ బీజస్య అన్తః అఙ్కురః ఇవ నిర్వికల్పమ్ పునః మాయాకల్పిత-దేశకాలకలనావైచిత్ర్య్-చిత్రీకృతమ్ యః స్వేచ్ఛయా మాయావీ ఇవ
మహాయోగీ ఇవ విజృమ్భయతి తస్మై శ్రీగురుమూర్తయే దక్షిణామూర్తయే ఇదం నమః ॥
 
ప్రతిపదార్థః-
ఇదమ్ = ఈ కనబడుతున్న
జగత్ = జగత్తు
ప్రాక్ = సృష్టికి పూర్వము
బీజస్య = విత్తనము యొక్క
అన్తః = లోపలనున్న
అఙ్కురః ఇవ = అంకురమువలే
నిర్వికల్పమ్ = ఎట్టి బేధము లేకుండనున్నది
పునః = సృష్టి సమయము నందు
మాయాకల్పిత-దేశకాలకలనావైచిత్ర్య్-చిత్రీకృతమ్ >
    మాయా- = మాయచే-
    కల్పిత- = కల్పించబడిన-
    దేశ- = దేశము-
    కాలకలనా- = కాలమువలన కలిగిన-
    వైచిత్ర్య్- = బేధముల వలన-
    చిత్రీకృతమ్ = చిత్రముగ చేయబడినది
యః = ఏ పరమాత్మ
స్వేచ్ఛయా = తన సంకల్పముచే
మాయావీ ఇవ = ఐంద్రజాలికుని వలే
విజృమ్భయతి = ఈ ప్రపంచమును విస్తరింపజేయుచున్నాడో
మహాయోగీవ = మహా యోగి వలె
తస్మై = ఆ
శ్రీగురుమూర్తయే = గురుస్వరూపుడగు
దక్షిణామూర్తయే = దక్షిణామూర్తి కొరకు
ఇదం = ఇదియే
నమః = నమస్కారము

🌹తాత్పర్యమ్
    జగత్కారణమేది? వైశేషికులు, తార్కికులు పరమాణువులు జగత్కారణమందురు. సాంఖ్యులు ప్రధానమునకు జగత్కారణత్వము చెప్పెదరు. శూన్యవాదులు శైవులు ఇట్లే జగత్కారణమును వేర్వేరు విధముల ప్రతిపాదించిరి. శంకర భగవత్పాదులు వీరి వాదములన్నింటిని శృతి, స్మృతి ప్రమాణ సహితముగా తోసి పుచ్చి, ఆత్మయే జగత్కారణమని
ప్రస్థాన త్రయాది భాష్యములలో నిరూపించిరి. ఈ విషయమునే శంకరులీ శ్లోకమున సోదాహరముగా ప్రతిపాదించుచున్నారు.
    బీజములో అంకురమున్నది వృక్షోత్పత్తికి పూర్వము శాఖలు పత్రములు, పుష్పములు, ఫలములు, పల్లవములు మొదలగు బేధములేమియు అంకురమందు లేవు. అనగా, అంకురము బీజములో నిర్వికల్పముగా వృక్షోత్పత్తి అనంతరము శాఖాది బేధమంతయు విజృంభించుచున్నది.
    అట్లే సృష్టికి పూర్వము జగత్తు ఆత్మయందు నిర్వికల్పముగనున్నది. అపుడు జగత్తుకు నామరూపాది బేధమేమియు లేదు. సృష్టికి పూర్వము ఆత్మమాత్రమే గలదు. పరమాత్మ మాయా ప్రభావముచే ఈ జగత్తును సృష్టించెను. జగత్తులో తద్ద్వారా నామరూపాది బేధములు మాయచే కల్పించబడినవి.
    కులాలుడు చేయు ఘట సృష్టికి చక్రాది సాధనములు అవసరము. పరమాత్మ ఏ సాధనములతో జగత్తు సృష్టించినాడు? అను ప్రశ్నకు సమాధానమే స్వేచ్ఛయా అను పదము. సిద్ధసంకల్పుడగు పరమాత్మ స్వసంకల్ప మాత్రముననే జగత్తు సృష్టించును. ఐంద్రజాలికుడు ఏ వస్తు సహాయము లేకుండగనే చిత్రమైన వస్తువులు సృజించును. విశ్వామిత్రాది మహాయోగులు ఎట్టి వస్తు సంచయము లేకనే యోగప్రభావమున త్రిశంకుస్వర్గాదులను సృష్టించలేదా

No comments:

Post a Comment